Supreme Court jobs: సుప్రీంకోర్టులో ఉద్యోగాల భర్తీ; ఇలా అప్లై చేసుకోండి
Supreme Court jobs: సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 80 కోర్టు అటెండెంట్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సుప్రీంకోర్టు అధికారిక వెబ్ సైట్ sci.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Supreme Court jobs: సుప్రీంకోర్టు జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సుప్రీంకోర్టు అధికారిక వెబ్ సైట్ sci.gov.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 80 పోస్టులను భర్తీ చేయనున్నారు.
లాస్ట్ డేట్ సెప్టెంబర్ 12
సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అటెండెంట్ (Junior Court Attendant) పోస్టులకు ఆగస్టు 23వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి గడువు సెప్టెంబర్ 12వ తేదీతో ముగుస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వం గుర్తించిన ఏదైనా బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుంచి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి కుకింగ్/కలినరీ ఆర్ట్స్ లో కనీసం ఏడాది ఫుల్టైమ్ డిప్లొమా ఉండాలి. 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అదనంగా, అభ్యర్థులు ప్రతిష్ఠాత్మక హోటల్/ రెస్టారెంట్/ గవర్నమెంట్ డిపార్ట్మెంట్/ అండర్టేకింగ్ మొదలైన వాటిలో మూడేళ్ల వంట అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం
సుప్రీంకోర్టు (supreme court) లో జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాతపరీక్ష ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. తరువాత, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాత పరీక్ష 100 మార్కులు, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్ 70 మార్కులు, ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటుంది. రాత పరీక్ష వ్యవధి 1 1/2 గంటలు (90 నిమిషాలు). నెగెటివ్ మార్కింగ్ ఉండదు. రాత పరీక్షను 16 రాష్ట్రాల్లోని 17 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ తరహా రాతపరీక్షలు, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్టులు, ఇంటర్వ్యూల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జాబితాను రూపొందిస్తారు.
అప్లికేషన్ ఫీజు
ఆసక్తి, అర్హత ఉండి ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు రూ.400 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ వికలాంగులు/ ఎక్స్ సర్వీస్మెన్/ స్వాతంత్య్ర సమరయోధులపై ఆధారపడినవారు/ వితంతువులు/ విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మహిళలకు దరఖాస్తు ఫీజు రూ.200/. దరఖాస్తు ఫీజును ఆన్లైన్ విధానంలోనే చెల్లించాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్సీఐ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.