meditation in schools: పాఠశాలల్లో రోజూ 10 నిమిషాలు ధ్యానం తప్పనిసరి-schools and pre university college students in karnataka to have daily meditation sessions ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Schools And Pre-university College Students In Karnataka To Have Daily Meditation Sessions

meditation in schools: పాఠశాలల్లో రోజూ 10 నిమిషాలు ధ్యానం తప్పనిసరి

HT Telugu Desk HT Telugu
Nov 03, 2022 05:46 PM IST

meditation in schools: కర్ణాటకలోని పాఠశాలలు, ఇంటర్మీడియటెడ్ స్థాయి కళాశాల విద్యార్థులు ప్రతి రోజు 10 నిమిషాలు ధ్యానం చేసేలా చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

కర్ణాటక పాఠశాలల్లో ప్రతి రోజూ ధ్యానం (ప్రతీకాత్మక చిత్రం)
కర్ణాటక పాఠశాలల్లో ప్రతి రోజూ ధ్యానం (ప్రతీకాత్మక చిత్రం) (HT_PRINT)

బెంగుళూరు, నవంబర్ 3: పాఠశాల, ప్రీ-యూనివర్శిటీ కళాశాల విద్యార్థులు ధ్యానం చేసేలా ఆదేశాలు జారీ చేసినట్లు కర్ణాటక పాఠశాల విద్య, అక్షరాస్యత మంత్రి బీసీ నగేష్ గురువారం తెలిపారు. ఈ మేరకు తన శాఖ అధికారులకు నోట్‌ కూడా పంపారు.

ట్రెండింగ్ వార్తలు

‘పాఠశాలలు, ప్రీ-యూనివర్శిటీ కళాశాలల్లో విద్యార్థులకు ప్రతిరోజూ 10 నిమిషాలపాటు ధ్యానం చేసేలా ఒక పీరియడ్ నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. వారి ఏకాగ్రతను పెంచడం, ఆరోగ్యం, సానుకూల ఆలోచనలు, ఒత్తిడి లేని అభ్యాసం, వ్యక్తిత్వ వికాసం.. తద్వారా మంచి లక్షణాలను పెంపొందించడం దీని ఉద్దేశం..’ అని నగేష్ గురువారం ఒక ట్వీట్‌లో సంబంధిత నోట్‌ షేర్ చేశారు.

కర్ణాటక రాష్ట్ర ప్రైమరీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు. కొన్ని పాఠశాలల్లో ఇప్పటికే మెడిటేషన్ సెషన్లు ఉన్నాయని పేర్కొంది.

IPL_Entry_Point