Ayodhya Ram Mandir scam alert : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. ఆ ఘట్టం ఇంకొన్ని రోజుల దూరంలోనే ఉంది. జనవరి 22న.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు. అత్యంత గ్రాండ్‌గా ఈ ఈవెంట్ జరగనుంది. అయితే.. ఈ ఈవెంట్ టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు! అమాయకులకు మాయ మాటలు చెప్పి స్కామ్‌లకు పాల్పడుతున్నారు.
సామాన్య ప్రజలు, నెటిజెన్లే టార్గెట్‌గా.. స్కామ్‌స్టర్స్ ఈ అయోధ్య రామ మందిర స్కామ్‌కి పాల్పడుతున్నారు. మెగా ఈవెంట్ రోజున, అంటే జనవరి 22న.. అయోధ్య రామ మందిరానికి వీఐపీ టికెట్లు ఇప్పిస్తామని వాట్సాప్‌లో మెసేజ్‌లు ఫార్వర్డ్ చేస్తున్నారు.
"జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు కావాలా? ఈ కింద ఇస్తున్న లింక్‌ని క్లిక్ చేసి, మీ వివరాలను తెలియజేయండి. మీ కుటుంబసభ్యులకు, బంధువులకు.. ఎవరికైతే టికెట్లు కావాలో వారికి కూడా ఈ మెసేజ్‌ని ఫార్వడ్ చేయండి," అని స్కామ్‌స్టర్స్ మెసేజ్‌లు చేస్తున్నారు.
Ayodhya Ram Mandir latest updates : మరికొందరు.. డైరక్ట్‌గా ఏపీకే ఫైల్ పంపించి డౌన్లోడ్ చేసుకోమని చెబుతున్నారు. ఆ ఏపీకే ఫైల్ పేరు.. 'రామ జన్మభూమి గ్రిహ్సంపర్క్ అభియాన్' అని ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న వారికి ఉచితంగా వీఐపీ ఎంట్రీలు ఇస్తామని చెబుతున్నారు.
ఆ మెసేజ్‌ల చివరిలో.. 'జైశ్రీరామ్.. జై జై శ్రీరామ్' అని ఉంటుంది.
ఇలాంటి మెసేజ్లోని లింక్స్ క్లిక్ చేసినా, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసినా.. ఇక అంతే! మీ డేటాను ఇవి దోచుకుంటాయి. అదే సమయంలో భయంకరమైన వైరస్‌ని ఇంజెక్ట్ చేస్తాయి. ఫలితంగా.. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాలన్నీ స్కామ్‌స్టర్స్ చేతుల్లోకి వెళతాయి. కాల్ రికార్డ్స్ నుంచి బ్యాంకింగ్ యాక్టివిటీల వరకు.. అన్ని వాళ్ల కంట్రోల్లో ఉంటాయి. మీరు చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగును వాళ్లు ట్రాక్ చేస్తారు. సమయం, సందర్భం చూసుకుని మీ డబ్బులను దోచేసుకుంటారు.
Ayodhya Ram Mandir news : రామ మందిర ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసి తరించాలని లక్షలాది మంది రామ భక్తులు కోరుకుంటున్నారు. దీనినే ప్రాఫిట్ అనుకుని, స్కామ్‌స్టర్స్ రెచ్చిపోతున్నారు. కానీ ఇక్కడ ఒక్క విషయం పొందాలి. ఆహ్వాన పత్రిక ఉంటేనే ఈవెంట్లోకి ఎంట్రీ లభిస్తుంది. ఆహ్వానం లేకుండా వెళితే.. వెనక్కి పంపించేస్తారు. ఈ మేరకు.. పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు గురువారం జరిగిన రివ్యూ మీటింగ్‌లో అధికారులకు ప్రత్యేక ఆదేశాలిచ్చారు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.
"రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి ఆహ్వానం లభించిన వారికే రామ మందిర ప్రారంభోత్సవానికి ఎంట్రీ ఉంటుంది. అయోధ్య హోటల్స్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న వారిని క్యాన్సిల్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోండి," అని స్పష్టం చేశారు యోగి ఆదిత్యనాథ్.
సంబంధిత కథనం
టాపిక్