SC on demonetisation case: ‘నోట్ల రద్దు’ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు-sc says it wants to conclude hearing on pleas challenging 2016 demonetisation this year defers for nov 24 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sc Says It Wants To Conclude Hearing On Pleas Challenging 2016 Demonetisation This Year, Defers For Nov 24

SC on demonetisation case: ‘నోట్ల రద్దు’ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu
Nov 09, 2022 03:32 PM IST

SC on demonetisation case: నోట్ల రద్దు నిర్ణయాన్నిసవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. 2016లో రూ. 1000, రూ. 500 నోట్ల చెలామణిని రద్దు చేస్తూ కేంద్రం అనూహ్య నిర్ణంయ తీసుకున్న విషయం తెలిసిందే.

సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు

SC on demonetisation case: 2016 నాటి నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

SC on demonetisation case: నవంబర్ 24కు వాయిదా..

ఈ పిటిషన్ల విచారణ బుధవారం కొనసాగింది. అనంతరం, తదుపరి విచారణను రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ అబ్డుల్ నజీర్, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్, జస్టిస్ బీవీ నాగరత్నలు సభ్యులుగా ఉన్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తోంది.

SC on demonetisation case: ఈ ఏడాదిలోనే ముగించేస్తాం..

తదుపరి విచారణను నవంబర్ 24కు వాయిదా వేస్తూ, ఈ సంవత్సరంలోనే ఈ కేసు విచారణను ముగించాలని అనుకుంటున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. పిటిషన్లపై ప్రభుత్వ స్పందనను, నోట్ల రద్దు నిర్ణయానికి కారణాలను సమగ్ర అఫిడవిట్ రూపంలో అందించాలని కేంద్రాన్ని, ఆర్బీఐని కోర్టు గత విచారణ సందర్భంగానే కోరింది. అయితే, బుధవారం ఆ అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించలేకపోయిన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి.. అందుకు మరోవారం సమయం కావాలని కోరారు.

IPL_Entry_Point