CIC on Remuneration to imams: ‘ఇమామ్ లకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలివ్వడమేంటి?’-sc order to pay remuneration to imams is in violation of constitution cic ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sc Order To Pay Remuneration To Imams Is In 'Violation Of Constitution': Cic

CIC on Remuneration to imams: ‘ఇమామ్ లకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలివ్వడమేంటి?’

HT Telugu Desk HT Telugu
Nov 26, 2022 04:30 PM IST

CIC on Remuneration to imams: మసీదుల్లో ఇమామ్ లకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వడంపై కేంద్ర సమాచార కమిషన్ ఘాటుగా స్పందించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు తప్పు చేసిందని వ్యాఖ్యానించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

CIC on Remuneration to imams: ఇమామ్ లకు గౌరవ వేతనం ఇవ్వడాన్ని సమర్ధిస్తూ 1993లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ ఉల్లంఘనేనని కేంద్ర సమాచార కమిషన్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

CIC on Remuneration to imams: రాజ్యాంగ ఉల్లంఘన

ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఇమామ్ లకు చెల్లించిన వేతనాల వివరాలు కావాలంటూ వచ్చిన ఒక సమాచార హక్కు దరఖాస్తు విచారణ సందర్బంగా సీఐసీ(Central Information Commission) ఈ వ్యాఖ్యలు చేసింది. ఇమామ్ లకు వేతనాలు ఇవ్వడాన్ని సమర్ధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ప్రధాన సమాచార కమిషనర్ ఉదయ్ మాహుర్కర్ విమర్శించారు. ఆ తీర్పు ఒక తప్పుడు ఉదాహరణగా నిలిచిపోయిందని, సమాజంలో విద్వేషాలకు, రాజకీయ వాదోపవాదాలకు కారణమైందని ఆరోపించారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును ఏదో ఒక మతానికి ఉపయోగపడేలా వాడకూడదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రాజ్యాంగంలోని 27వ అధికరణ స్పష్టంగా చెబుతోందన్నారు. వక్ఫ్ బోర్డ్ నిర్వహణలో ఉన్న మసీదుల్లోని ఇమామ్ లకు గౌరవ వేతనం ఇవ్వాలని 1993లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

CIC on Remuneration to imams: ఆర్టీఐ దరఖాస్తు దారుడికి పరిహారం

ఇమామ్ లకు ఇచ్చిన జీతభత్యాలపై సమాచారం కోరిన సమాచార హక్కు కార్యకర్త సుభాష్ అగర్వాల్ కు, ఆ సమాచారం ఇవ్వనందుకు, అతడి విలువైన కాలాన్ని వృధా చేసినందుకు రూ. 25 వేలు చెల్లించాలని వక్ఫ్ బోర్డును సీఐసీ ఆదేశించారు. భారత్ పాకిస్తాన్ వలె మత ప్రాతిపదికన ఏర్పాటైన దేశం కాదని, లౌకిక వ్యవస్థగా, అందరికీ సమాన హక్కులను కల్పిస్తూ ఏర్పాటైన దేశమని సీఐసీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఖజానా నుంచి మసీదుల్లోని ఇమామ్ లకే వేతనం ఇవ్వడం, హిందూ సహా ఇతర మతాలను మోసం చేయడమేనని విమర్శించారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఏటా రూ. 62 కోట్లను గ్రాంట్ గా పొందుతుంది.

IPL_Entry_Point

టాపిక్