SC ruling on Shivsena row | ఠాక్రేకు షాక్.. షిండేకు రిలీఫ్-sc allows ec to go ahead with hearing shinde group s claim of being real shiv sena ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sc Ruling On Shivsena Row | ఠాక్రేకు షాక్.. షిండేకు రిలీఫ్

SC ruling on Shivsena row | ఠాక్రేకు షాక్.. షిండేకు రిలీఫ్

HT Telugu Desk HT Telugu
Sep 27, 2022 07:25 PM IST

SC ruling on Shivsena row | శివసేన పార్టీ, పార్టీ గుర్తు, జెండా ఎవరికి చెందాలనే విషయంలో ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

<p>ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే</p>
<p>ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే</p>

SC ruling on Shivsena row | నాటకీయ పరిణామాల మధ్య మహారాష్ట్రలో అధికారం శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నుంచి తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండేకు మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ రెండు వర్గాల మధ్య శివసేన ఓనర్ షిప్ పై వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంలో మంగళవారం సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది.

SC ruling on Shivsena row | ఎన్నికల సంఘానికి అధికారం

ఈ కేసులో మంగళవారం జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వాదనలు విన్నది. అసలైన శివసేన తమదేనన్న ఏక్ నాథ్ షిండే అభ్యర్థనపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలన్న ఉద్ధవ్ ఠాక్రే పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోవచ్చని తీర్పు ప్రకటించింది. ‘శివసేన విషయంలో ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి స్టే ఇవ్వడం లేదు’ అని ధర్మాసనం తీర్పునిచ్చింది.

SC ruling on Shivsena row | షిండేకు ఊరట

దాంతో, శివసేన పార్టీ, పార్టీ ఎన్నికల గుర్తు , జెండా తన వర్గానికే చెందాలన్న ఏక్ నాథ్ షిండే వాదనలు విని, తదనుగుణంగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునేందుకు మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టులో మంగళవారం జరిగిన ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ తీర్పుతో మహారాష్ట్రలో షిండే వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు.