SBI SCO Recruitment: ఎస్బీఐ లో మేనేజర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ ల భారీ రిక్రూట్మెంట్-sbi sco recruitment 2023 apply for 442 manager and specialist posts at sbicoin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Sbi Sco Recruitment 2023: Apply For 442 Manager And Specialist Posts At Sbi.co.in

SBI SCO Recruitment: ఎస్బీఐ లో మేనేజర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ ల భారీ రిక్రూట్మెంట్

HT Telugu Desk HT Telugu
Sep 16, 2023 08:40 PM IST

SBI SCO Recruitment: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ లో మేనేజర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 442 పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఎస్బీఐ అధికారికర వెబ్ సైట్ sbi.co.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

SBI SCO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in ద్వారా ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 16న ప్రారంభమవుతుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 442 మేనేజర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

లాస్ట్ డేట్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 6. ఈ లోపు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఎస్బీఐ అధికారికర వెబ్ సైట్ sbi.co.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన రాత పరీక్ష ఈ సంవత్సరం డిసెంబర్ లేదా 2024 జనవరిలో జరగవచ్చు. ఈ పరీక్షకు సంబంధించిన కాల్ లెటర్స్ ను అభ్యర్థులు ఎస్బీఐ అధికారికర వెబ్ సైట్ sbi.co.in నుంచి పరీక్షకు 10 రోజుల ముందు నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ

రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్ట్ లకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ సంవత్సరం డిసెంబర్ లేదా 2024 జనవరిలో జరిగే రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఆ తరువాత జరిగే ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ రాత పరీక్ష విభాగాల వారీగా ఆయా సబ్జెక్టులపై ఉంటుంది. అభ్యర్థులు రూ. 750 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల వారు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ లో క్రెడిట్, డెబిట్ కార్డులు, యూపీఐ, ఆన్ లైన్ బ్యాంకింగ్ వంటి విధానాల ద్వారా ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్‌ని పరిశీలించాలి.

WhatsApp channel
తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.