SBI SCO Recruitment 2023: ఎస్బీఐ లో 439 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ జాబ్స్; రేపే లాస్ట్ డేట్-sbi sco recruitment 2023 apply for 439 vacancies till tomorrow on sbicoin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sbi Sco Recruitment 2023: ఎస్బీఐ లో 439 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ జాబ్స్; రేపే లాస్ట్ డేట్

SBI SCO Recruitment 2023: ఎస్బీఐ లో 439 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ జాబ్స్; రేపే లాస్ట్ డేట్

HT Telugu Desk HT Telugu

SBI SCO Recruitment 2023: స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) ఉద్యోగాల రిక్రూట్ మెంట్ కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం (HT File)

SBI SCO Recruitment 2023: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 6. అంటే రేపటితో ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అవకాశం ముగుస్తుంది.

మొత్తం 439 పోస్ట్ లు..

ఈ రిక్రూట్మెంట్ ద్వారా 45 కేటగిరీల్లో మొత్తం 439 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) ఉద్యోగాలను భర్తీ చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భావిస్తోంది. ఆసక్తి, అర్హత ఉండి, ఇప్పటివరకు ఈ పోస్ట్ లకు అప్లై చేయని అభ్యర్థులు వెంటనే ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ లోని sbi.co.in/web/careers లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, అనుభవం.. మొాదలైనవి ఒక్కో కేటగిరీకి ఒక్కో విధంగా ఉంటుంది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ముందుగా sbi.co.in వెబ్ సైట్ లోని సమగ్ర నోటిఫికేషన్ ను పరిశీలించాలి.

ముఖ్యమైన వివరాలు..

  • సెప్టెంబర్ 16 నుంచి అప్లకేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
  • అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 6.
  • ఆన్ లైన్ ఎగ్జామ్ డిసెంబర్ చివర్లో కానీ, 2024 జనవరి మొదట్లో కానీ ఉంటుంది.
  • పరీక్షకు 10 రోజుల ముందు నుంచి sbi.co.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ. 750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
  • అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ల ద్వారా చెల్లించవచ్చు.

అప్లై ఇలా చేయండి

  • ముందుగా sbi.co.in/web/careers వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.
  • పైన కనిపించే join SBI ను క్లిక్ చేయండి. అనంతరం current openings ను క్లిక్ చేయండి
  • apply online పేజ్ లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయండి.
  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయండి
  • అప్లికేషన్ ఫీజును చెల్లించండి.
  • అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయండి.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ కాపీని ప్రింట్ తీసి పెట్టుకోండి.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.