Telugu News  /  National International  /  Sbi Recruitment 2022 Know Application Process Vacancy Details For Specialist Cadre Officer Posts Here
SBI Recruitment 2022: 65 స్పెషలిస్ట్ ఆఫీసర్ల కోసం ఎస్‌బీఐ నోటిఫికేషన్
SBI Recruitment 2022: 65 స్పెషలిస్ట్ ఆఫీసర్ల కోసం ఎస్‌బీఐ నోటిఫికేషన్

SBI Recruitment 2022: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై ఇలా

24 November 2022, 14:40 ISTHT Telugu Desk
24 November 2022, 14:40 IST

SBI Recruitment 2022: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అర్హులైన అభ్యర్థుల నుంచి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఎస్‌బీఐ అధికారిక సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 22నే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. డిసెంబరు 12న ముగుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఎస్‌బీఐ 65 పోస్టులను భర్తీ చేస్తుంది. ఎలిజిబులిటీ నిబంధనలు, ఎంపిక ప్రక్రియ ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

వేకెన్సీ వివరాలు

  • మేనేజర్ పోస్టులు: 64
  • సర్కిల్ అడ్వైజర్ పోస్టులు: 1

స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు అర్హతలు

స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు విద్యార్హతలు, వయస్సు పరిమితి తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

ఎంపిక ప్రక్రియ ఇలా

ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటరాక్షన్‌కు పిలుస్తారు. ఈ పోస్టులకు రాతపరీక్ష ఉండదు. కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో లభించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు.

దరఖాస్తు రుసుం ఎంతంటే?

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఎస్‌బీఐ కెరీర్ వెబ్‌సైట్‌లో సంబంధిత పేమెంట్ గేట్‌వే ఉంటుంది.

అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, ఖాళీలు, రిజర్వేషన్లతో కూడిన సమగ్ర నోటిఫికేషన్ కోసం ఈ కింది లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.

టాపిక్