SBI hikes interest rates on fixed deposits: SBI వడ్డీ రేట్ల పెంపు-sbi hikes interest rates on fixed deposits fds across tenors by up to 20 bps ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sbi Hikes Interest Rates On Fixed Deposits (Fds) Across Tenors By Up To 20 Bps

SBI hikes interest rates on fixed deposits: SBI వడ్డీ రేట్ల పెంపు

HT Telugu Desk HT Telugu
Oct 15, 2022 08:56 PM IST

SBI hikes interest rates on fixed deposits: భారతదేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ ని పెంచుతున్నట్లు ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రూ. 2 కోట్ల లోపు ఉన్న అన్ని ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతున్నట్లు SBI శనివారం ప్రకటించింది. కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

SBI hikes interest rates on fixed deposits: 20 బేసిస్ పాయింట్ల వరకు

ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను SBI 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. పెంచిన వడ్డీ రేట్ల అనంతరం.. 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాల పరిమితి గల డిపాజిట్లకు 3.0% నుంచి 5.85% వరకు వడ్డీ లభిస్తుంది. అలాగే, సీనియర్ సిటిజన్లకు 3.5% నుంచి 6.65% వరకు వడ్డీ లభిస్తుంది.

మినిమం 3 శాతం.. మాగ్జిమం 6.65%

- 7 రోజుల నుంచి 45 రోజలు కాలపరిమితి కలిగిన ఎఫ్ డీల వడ్డీ రేటును 2.9% నుంచి 3.0 శాతానికి పెంచారు.

- 46 రోజుల నుంచి 179 రోజలు కాలపరిమితి కలిగిన ఎఫ్ డీల వడ్డీ రేటును 3.9% నుంచి 4.0 శాతానికి పెంచారు.

-180 రోజుల నుంచి 210 రోజలు కాలపరిమితి కలిగిన ఎఫ్ డీల వడ్డీ రేటును 4.55% నుంచి 4.65 శాతానికి పెంచారు.

- 211 రోజుల నుంచి సంవత్సరం లోపు కాలపరిమితి కలిగిన ఎఫ్ డీల వడ్డీ రేటును 4.6% నుంచి 4.70 శాతానికి పెంచారు.

- సంవత్సరం నుంచి రెండు సంవత్సారాల లోపు కాలపరిమితి కలిగిన ఎఫ్ డీల వడ్డీ రేటును 5.45% నుంచి 5.60 శాతానికి పెంచారు.

- 2 సంవత్సరాల నుంచి మూడు సంవత్సారాల లోపు కాలపరిమితి కలిగిన ఎఫ్ డీల వడ్డీ రేటును 5.50% నుంచి 5.65 శాతానికి పెంచారు.

- 3 సంవత్సరాల నుంచి ఐదు సంవత్సారాల లోపు కాలపరిమితి కలిగిన ఎఫ్ డీల వడ్డీ రేటును 5.60% నుంచి 5.80 శాతానికి పెంచారు.

- 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సారాల లోపు కాలపరిమితి కలిగిన ఎఫ్ డీల వడ్డీ రేటును 5.65% నుంచి 5.85 శాతానికి పెంచారు.

- సీనియర్ సిటిజన్లకు పైన పేర్కొన్న వడ్డీ రేట్లపై 0.5% అదనంగా లభిస్తుంది.

IPL_Entry_Point