SBI Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త; ఎస్బీఐ లో 8 వేలకు పైగా పోస్ట్ ల భర్తీ; డిగ్రీ ఉంటే చాలు..-sbi clerk recruitment 2023 notification for 8283 posts out at sbicoin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sbi Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త; ఎస్బీఐ లో 8 వేలకు పైగా పోస్ట్ ల భర్తీ; డిగ్రీ ఉంటే చాలు..

SBI Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త; ఎస్బీఐ లో 8 వేలకు పైగా పోస్ట్ ల భర్తీ; డిగ్రీ ఉంటే చాలు..

HT Telugu Desk HT Telugu
Nov 16, 2023 04:54 PM IST

SBI Clerk Recruitment 2023 notification: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేట్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

SBI Clerk Recruitment 2023: క్లర్క్ పోస్ట్ ల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India SBI) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్బీఐ మొత్తం 8283 జూనియర్ అసోసియేట్ (Junior Associate) పోస్ట్ లను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ నవంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

ఆన్ లైన్ అప్లికేషన్..

ఎస్బీఐ (SBI) లో 8283 జూనియర్ అసోసియేట్ పోస్ట్ లకు అప్లై చేసుకోవాలనుకునే అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in. ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ 7. కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగంలో ఈ 8283 జూనియర్ అసోసియేట్ పోస్ట్ లను ఎస్బీఐ భర్తీ చేస్తోంది.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 17, 2023
  • దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 7, 2023
  • ప్రిలిమినరీ పరీక్ష: జనవరి 2024
  • ప్రధాన పరీక్ష: ఫిబ్రవరి 2024

Eligibility: అర్హత, ఇతర వివరాలు..

ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి, ఏదైనా విభాగంలో కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత అయినా కలిగి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులు కూడా అర్హులే. వారు డిసెంబర్ 31, 2023 నాటికి ఐడీడీ సర్టిఫికెట్ పొంది ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

Selection: ఎంపిక ప్రక్రియ

ఈ పోస్ట్ ల ఎంపిక ప్రక్రియలో ముందుగా ప్రిలిమినరీ పరీక్ష, స్థానిక భాషకు సంబంధించిన పరీక్ష ఉంటుంది.ఈ పరీక్ష 2024, జనవరిలో జరిగే అవకాశం ఉంది. ఈ ప్రిలిమ్స్ పరీక్ష 100 మార్కులకు గానూ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ పరీక్షను ఆన్ లైన్ లో రాయాల్సి ఉంటుంది. మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు గంట వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. ప్రిలిమ్స్ లో ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీలపై ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

Application Fees: అప్లికేషన్ ఫీజు

ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థుల్లో జనరల్, ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు రూ. 750 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు ను ఆన్ లైన్ లోనే చెల్లించాలి.

WhatsApp channel