SBI CBO Final Results: ఎస్బీఐ సీబీఐ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయి..-sbi cbo final result 2022 declared at sbi co in direct link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sbi Cbo Final Result 2022 Declared At Sbi.co.in, Direct Link Here

SBI CBO Final Results: ఎస్బీఐ సీబీఐ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయి..

HT Telugu Desk HT Telugu
Mar 09, 2023 12:24 PM IST

SBI CBO Final Result 2022: ఎస్బీఐ సీబీఐ ఫైనల్ రిజల్ట్స్ 2022 విడుదల అయ్యాయి. ఆ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT File)

SBI CBO Final Result 2022: సీబీఓ(CBO) ఫైనల్ ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) విడుదల చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులు తమ ఫైనల్ రిజల్ట్ ను ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in లో చెక్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

SBI CBO Final Result 2022: సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్SBI CBO Final Result 2022:

ఎస్బీఐ సీబీఓ 2022 రాత పరీక్ష డిసెంబర్ 4వ తేదీన జరిగింది. ఆ ఫలితాలను ఈ సంవత్సరం జనవరి 30న విడుదల చేశారు. ఆ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 3 న ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ పంపించారు. ఫిబ్రవరి 18 నుంచి వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఎస్బీఐ సీబీఓ (SBI CBO) పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత సంవత్సరం అక్టోబర్ 18న ప్రారంభమైంది. అప్పడు మొత్తం 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ (CBO) పోస్ట్ లను భర్తీ చేయడం కోసం ఆ నోటిఫికేషన్ ను ఎస్బీఐ (SBI) జారీ చేసింది.

SBI CBO Final Result 2022: How to check: రిజల్ట్ చెక్ చేసుకోవడం ఇలా..

  • మొదట ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీలో కనిపించే కెరియర్స్ (careers) లింక్ పై క్లిక్ చేయాలి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో SBI CBO Final Result 2022 లింక్ పై క్లిక్ చేయాలి.
  • కొత్త పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్ లో రోల్ నెంబర్ ఆధారంగా తమ ఫలితాలను అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు.
  • ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తమ ఫలితమున్న పేజీని డౌన్లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ ను ప్రింట్ తీసి పెట్టుకోవాలి.

Direct link to check SBI CBO Final Result 2022

WhatsApp channel

టాపిక్