ఇండియా సహా 16 దేశాలకు ప్రయాణాలను నిషేధించిన సౌదీ-saudi arabia bans travel to 16 countries including india over new covid outbreaks ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Saudi Arabia Bans Travel To 16 Countries Including India Over New Covid Outbreaks

ఇండియా సహా 16 దేశాలకు ప్రయాణాలను నిషేధించిన సౌదీ

HT Telugu Desk HT Telugu
May 23, 2022 09:00 AM IST

జెడ్దా (సౌదీ అరేబియా) : కోవిడ్-19 కేసుల రోజువారీ సంఖ్య గత కొన్ని వారాలుగా పెరుగుతున్నందున సౌదీ అరేబియా తన పౌరులు ఇండియా సహా 16 దేశాల్లో ప్రయాణించడాన్ని నిషేధించింది.

సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్
సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (VIA REUTERS)

ఇండియా, లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, అఫ్ఘనిస్తాన్, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, కాంగో రిపబ్లిక్, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, అర్మేనియా, బెలారస్, వెనిజులా తదితర 16 దేశాలకు ప్రయాణించవద్దని దేశ పౌరులను ఆదేశించినట్టు గల్ఫ్ న్యూస్ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

దేశంలో మంకీపాక్స్ కేసులు ఒక్కటీ నమోదు కాలేదని సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ ప్రకటించింది. అనుమానిత మంకీపాక్స్ కేసులు కనిపెట్టడానికి, పర్యవేక్షించడానికి, అలాగే ఎలాంటి కొత్త ఇన్ఫెక్షన్‌లపైనైనా పోరాడేందుకు తగిన సామర్థ్యం కలిగి ఉన్నట్టు ఆరోగ్య శాఖ ఉప మంత్రి అబ్దుల్లా అసిరి ప్రకటించారు.

‘ఇప్పటివరకు మనుషుల్లో ఈ కేసుల వ్యాప్తి చాలా పరిమితంగా ఉంది. ఇది వ్యాప్తి చెందేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మంకీపాక్స్ కేసులు నమోదైన దేశాల్లో కూడా వ్యాప్తి తక్కువగా ఉంది..’ అని చెప్పారు.

కాగా ఇప్పటివరకు 11 దేశాల్లో 80 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. మంకీపాక్స్ కేసుల వ్యాప్తికి కారణాలు, ఏమేరకు వ్యాప్తి చెందగలదు వంటి అంశాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపింది.

ప్రస్తుతం కొన్ని దేశాల్లో జంతువుల్లో వ్యాప్తి చెందిందని, స్థానికంగా ప్రజలు, ప్రయాణికులకు కూడా అప్పుడప్పుడు సోకుతుందని డబ్ల్యూహెచ్‌ఓ శుక్రవారం ప్రకటించింది.

యూరోప్​లోని బెల్జియం, ఫ్రాన్స్​, స్పెయిన్​, జర్మనీ, ఇటలీ, నెదర్​ల్యాండ్స్​, పోర్చుగల్​, స్వీడన్, యూకేల్లో మొత్తంగా మంకీపాక్స్​ కేసుల సంఖ్య 100 దాటిపోయింది. ఒక్క స్పెయిన్​లోనే శుక్రవారం మంకీపాక్స్​ వైరస్​ కేసులు 24 వెలుగులోకి వచ్చాయి.

మంకీపాక్స్ అంటువ్యాధి వ్యాప్తితో యూరోప్ దేశాలు భయాందోళన చెందుతున్నాయి. అమెరికాలోనూ మంకీపాక్స్ కేసు నిర్ధారణ అయినట్లు మసాచుసెట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ ధృవీకరించింది. పిల్లలకు మంకీపాక్స్ సోకినప్పుడు ప్రాణాంతకంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఫ్లూలాగా మొదలై, శోషరస కణుపుల్లో వాపు మొదలవుతుందని, తర్వాత ముఖం, శరీరంపై దద్దుర్లు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోశ నాళాలు, కళ్ళు, ముక్కు, నోటి ద్వారా మంకీపాక్స్ వైరస్ శరీరంలోకి చేరుతుంది. రోగి శరీరంలో 5 రోజుల నుంచి 21రోజుల వరకు ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది

WhatsApp channel

టాపిక్