Satyendar Jain Tihar Jail Video: జైలులో హౌస్ కీపింగ్ సర్వీస్.. మసాజ్, బయటి ఫుడ్ తర్వాత మరో వీడియో లీక్-satyendar jain tihar jail video after massage lavish meal now housekeeping video emerges ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Satyendar Jain Tihar Jail Video After Massage Lavish Meal Now Housekeeping Video Emerges

Satyendar Jain Tihar Jail Video: జైలులో హౌస్ కీపింగ్ సర్వీస్.. మసాజ్, బయటి ఫుడ్ తర్వాత మరో వీడియో లీక్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 27, 2022 03:07 PM IST

Satyendar Jain Tihar Jail Video: ఆమ్ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ జైన్‍కు సంబంధించి తీహార్ జైలు నుంచి మరో వీడియో ఫుటేజ్ లీకైంది. ఆయన జైలు గదిలో వేరే వ్యక్తులు హౌస్ కీపింగ్ సర్వీస్ చేస్తున్నట్టుగా ఇందులో ఉంది. పూర్తి వివరాలివే..

Satyendar Jain Tihar Jail Video: జైలులో హౌస్ కీపింగ్ సర్వీస్ (ANI)
Satyendar Jain Tihar Jail Video: జైలులో హౌస్ కీపింగ్ సర్వీస్ (ANI) (ANI)

Satyendar Jain Tihar Jail Video: తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి, ఆమ్‍ఆద్మీ పార్టీ (Aam Aadmi Party - AAP) నేత సత్యేందర్ జైన్‍కు సంబంధించిన వీడియో లీక్‍ల వ్యవహారం కొనసాగుతూనే ఉంది. జైలులోని సెల్‍లో ఆయన మసాజ్ చేయించుకున్న వీడియో, బయటి ఫుడ్ తింటున్న సీసీ టీవీ ఫుటేజ్‍లు ఇటీవల బయటికి వచ్చాయి. దీంతో జైలులో ఆయన విలాసవంతంగా ఉన్నారని, సకల సౌకర్యాలను అనుభవిస్తున్నారని బీజేపీ విమర్శల దాడి కొనసాగిస్తోంది. ఈ తరుణంలో సత్యేందర్ ఉంటున్న జైలు గది నుంచి మరో వీడియో బయటికి వచ్చింది. ఆయన సెల్‍లో హౌస్ కీపింగ్ సర్వీస్ చేస్తున్నట్టుగా అందులో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

తీహార్ జైలులో సత్యేందర్ జైన్ ఉంటున్న సెల్‍లో వేరే వ్యక్తులు హౌస్ కీపింగ్ చేస్తున్నట్టు తాజాగా వీడియో ఫుటేజ్ బయటికి వచ్చింది. ఇది సెప్టెంబర్ 13, 15, అక్టోబర్ 1కి సంబంధించిన వీడియో ఫుటేజ్ అని జైలు వర్గాల నుంచి సమాచారం ఉన్నట్టు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. సత్యేందర్ జైన్ ఉంటున్న జైలు గదిని కొందరు వ్యక్తులు శుభ్రం చేస్తున్నట్టు ఆ వీడియోలో ఉంది. జైలు గది నేలను ఊడుస్తూ, మంత్రి నిద్రించే బెడ్‍ను సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు జైలులోని ఇతర వ్యక్తులను సత్యేందర్ జైన్ కలిసినట్టు కూడా మరో వీడియో బయటికి వచ్చింది.

ఇది నాలుగోది..

Satyendar Jain Tihar Jail Video: తీహార్ జైలులో ఉన్న సత్యేందర్ జైన్‍కు సంబంధించి వీడియో ఫుటేజ్ బయటికి రావడం ఇది నాలుగోసారి. ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్.. జైలు గదిలో బాడీ మసాజ్ చేయించుకుంటున్నట్టు ఓ సీసీ టీవీ ఫుటేజ్ నవంబర్ 19న బయటికి వచ్చింది. ఆ తర్వాత, బయటి నుంచి తెచ్చిన ఆహారాన్ని సత్యేందర్.. సెల్‍లో కూర్చొని తింటున్నట్టు రెండో సీసీటీవీ ఫుటేజ్ లీకైంది. జైలులో సరైన ఆహారం లభించని కారణంగా 28కేజీల బరువు తగ్గానని.. ఆయన చెప్పిన మరుసటి రోజునే ఈ వీడియో బయటికి వచ్చింది. అయితే జైలుకు వచ్చాక ఆయన 8కేజీల బరువు పెరిగినట్టు తీహార్ జైలు వర్గాలు చెప్పినట్టు కూడా సమాచారం.

ఇక జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ తో పాటు మరికొందరిని తన జైలు గదిలోనే సత్యేందర్ జైన్ కలిసినట్టు మరో ఫుటేజ్ ఈనెల 26న బయటికి వచ్చింది. ఇక ఆదివారం రోజున ఈ హౌస్ కీపింగ్ సర్వీస్‍కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెల్లడైంది.

ఆప్‍పై బీజేపీ విమర్శలు

Satyendar Jain Tihar Jail Video: ఇక మూడో వీడియో బయటికి వచ్చాక.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహనాజ్ పునావాలా స్పందించారు. ఆప్ అవినీతి దర్బార్ అంటూ విమర్శలు గుప్పించారు. అంతకు ముందు కూడా ఈ వ్యవహారంపై పునావాలా ఆరోపణలు చేశారు. సత్యేందర్ జైన్.. జైలులో మసాజ్ చేయించుకున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‍కు తెలుసునని ఆరోపించారు. మంత్రివర్గం నుంచి ఆయనను బర్తరఫ్ చేయాలని అన్నారు. అలాగే బీజేపీ నేతలు చాలా మంది ఈ వ్యవహారంపై ఆమ్‍ఆద్మీని విమర్శించారు.

మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఉన్నారు.

IPL_Entry_Point