Sarabjit Singh wife death : పాక్​ జైలులో మరణించిన సరబ్జిత్​ సింగ్​ సతీమణి దుర్మరణం-sarabjit singh wife sukhpreet kaur killed in accident ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sarabjit Singh Wife Sukhpreet Kaur Killed In Accident

Sarabjit Singh wife death : పాక్​ జైలులో మరణించిన సరబ్జిత్​ సింగ్​ సతీమణి దుర్మరణం

Sharath Chitturi HT Telugu
Sep 13, 2022 06:38 AM IST

Sarabjit Singh wife death : అమృత్​సర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుఖ్​ప్రీత్​ కౌర్​ మరణించారు. ఆమె.. పాకిస్థాన్​ జైలులో మరణించిన సరబ్జిత్​ సింగ్​ భార్య.

సరబ్జిత్​ సింగ్​ సతీమణి కన్నుమూత
సరబ్జిత్​ సింగ్​ సతీమణి కన్నుమూత (HT_PRINT)

Sarabjit Singh wife death : పాకిస్థాన్​ జైలులో మరణించిన సరబ్జిత్​ సింగ్​ సతీమణి సుఖ్​ప్రీత్​ కౌర్​​.. సోమవారం తుదిశ్వాస విడిచారు. బైక్​ వెనక కూర్చుని వెళుతున్న ఆమె ఒక్కసారిగా కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ ఫలితం దక్కలేదు. ఆసుపత్రిలో ఆమె కన్నుమూశారు.

ట్రెండింగ్ వార్తలు

అమృత్​సర్​లోని ఫతేహ్​పూర్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. కాగా.. సుఖ్​ప్రీత్​ కౌర్​ అంత్యక్రియలు మంగళవారం ఆమె స్వస్థలం భిఖివిండ్​ ప్రాంతంలో జరగనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Sukhpreet Kaur : సరబ్జిత్​ సింగ్​- సుఖ్​ప్రీత్​ కౌర్​కు పూనం, స్వపన్​దీప్​ కౌర్​ అనే ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు.

సరబ్జిత్​ సింగ్​ను పాకిస్థాన్​ జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేసిన ఆయన సోదరి దల్బీర్​ కౌర్​.. గుండె పోటు కారణంగా ఈ ఏడాది జూన్​లో మరణించారు.

పాకిస్థాన్​ జైలులో..

పాకిస్థాన్​లో ఉగ్రవాదానికి, గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు ఆరోపిస్తూ.. 1991లో అక్కడి కోర్టు సరబ్జిత్​ సింగ్​కు ఉరిశిక్ష విధించింది. 2008లో ఆ ఉరిశిక్షను నిరవధికంగా వాయిదా వేసింది.

Sarabjit Singh Pakistan jail : కాగా.. 2013లో తోటి ఖైదీలు చేసిన దాడిలో 49ఏళ్ల సరబ్జిత్​ సింగ్​ ప్రాణాలు కోల్పోయారు.

సరబ్జిత్​ సింగ్​ మరణం అనంతరం ఆయన మృతదేహాన్ని లాహోర్​ జైలు నుంచి అమృత్​సర్​కి తీసుకొచ్చారు. అక్కడే ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం