చెత్త కుండీలో 5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్.. తిరిగి ఇచ్చేసిన పారిశుధ్య కార్మికుడు-sanitary worker returned 5 lakh rupees worth diamond necklace to its owner in chennai see video ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  చెత్త కుండీలో 5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్.. తిరిగి ఇచ్చేసిన పారిశుధ్య కార్మికుడు

చెత్త కుండీలో 5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్.. తిరిగి ఇచ్చేసిన పారిశుధ్య కార్మికుడు

Anand Sai HT Telugu

Chennai News : పది రూపాయలు దొరికితేనే అటు ఇటు చూసి జేబులో వేసేసుకుంటారు. చాలా మందికి ఇదే అలవాటు. కానీ ఓ పారిశుధ్య కార్మికుడు మాత్రం 5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ తెచ్చి యజమానికి తిరిగి ఇచ్చాడు.

డైమండ్ నెక్లెస్ తిరిగి ఇచ్చేసిన పారిశుధ్య కార్మికుడు (Twitter)

నీట్ పరీక్ష పత్రం లీకేజీ ఘటనపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా నీట్ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్నపై చర్చ జరిగింది. ఒకే ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఇచ్చారని పిటిషనర్లు పేర్కొన్నారు. కానీ మార్కులు మాత్రం ఒకేదానికి వేశారంటూ తెలిపారు. అయితే దానికి మార్కులు ఇచ్చినా.. ఇవ్వకున్నా మెరిట్ లిస్ట్ మారే అవకాశం ఉందన్నారు.

పిటిషనర్ల విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ ప్రశ్నకు సరైన సమాధానం కోసం.. సంబంధిత సబ్జెక్ట్‌కు చెందిన ముగ్గురు నిపుణులను ఏర్పాటు చేసి.. జులై 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సరైన సమాధానం చెప్పాలని ఐఐటీ దిల్లీ డైరెక్టర్‌ను ఆదేశించింది. NEET -UG 2024 పరీక్షలో భౌతిక శాస్త్ర ప్రశ్నకు సమాధానంగా ఈ నిర్ణయం తీసుకుంది.

జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం, 'ఐఐటీ దిల్లీ నిపుణుల బృందం ప్రశ్నకు సరైన సమాధానంపై తమ అభిప్రాయాన్ని రూపొందించి, జులై 23న మధ్యాహ్నం 12 గంటలలోపు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు తెలియజేయాలి.' అని కోర్టు పేర్కొంది.

మాల్ ప్రాక్టీసెస్, పేపర్ లీక్ ఆరోపణలతో పరీక్షపై వచ్చిన సమస్య కారణంగా నిపుణుల కమిటీ నియామకం తిరిగి పరీక్షను కోరుకునే ఇతర విద్యార్థుల డిమాండ్‌పై ఎలాంటి ప్రభావం చూపదని కోర్టు స్పష్టం చేసింది. 'మొత్తం పునఃపరీక్షను చూడటం కంటే ముందుగా ఈ సమస్యను పరిష్కరించాలనే ఆలోచన ఉంది.' అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.

మరోవైపు విద్యార్థులు చేసిన వాదనలు, మళ్లీ నీట్‌ను నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేసింది. అంతకుముందు విద్యార్థుల తరఫు సీనియర్‌ న్యాయవాది నరేంద్ర హుడా కోర్టుకు హాజరయ్యారు. మే4కు ముందే పేపర్ లీకేజీ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది ధర్మాసనం. పరీక్షను నిర్వహించే విధానం చాలా పెళుసుగా ఉందని అభిప్రాయపడింది.

ఇప్పటికే NTA పేపర్ లీక్‌ను అంగీకరించింది. బీహార్ పోలీసుల దర్యాప్తు నివేదికను ప్రస్తావిస్తూ.. స్ట్రాంగ్ రూమ్ నుంచే ప్రశ్నపత్రం బయటకు వచ్చిందా అని కోర్టు ప్రశ్నించింది.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర సంబంధిత కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (నీట్-యూజీ)ను ఎన్టీఏ నిర్వహిస్తుంది. నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.