శ్రీలంకలో ఉప్పు సంక్షోభం.. భారత్ సాయం.. అక్కడ కేజీ ధర ఎంతో తెలుసా?-salt crisis in sri lanka due to these reasons salt being sold 145 per kg india helped neighbouring country ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  శ్రీలంకలో ఉప్పు సంక్షోభం.. భారత్ సాయం.. అక్కడ కేజీ ధర ఎంతో తెలుసా?

శ్రీలంకలో ఉప్పు సంక్షోభం.. భారత్ సాయం.. అక్కడ కేజీ ధర ఎంతో తెలుసా?

Anand Sai HT Telugu

శ్రీలంకలో ఉప్పు సంక్షోభం నడుస్తోంది. ఉప్పు దొరకక ధరలు విపరీతంగా పెరిగాయి. భారీ వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో ఉప్పు ఉత్పత్తిదారులు అతిగా నష్టపోయారు.

శ్రీలంకలో ఉప్పు సంక్షోభం

పొరుగు దేశమైన శ్రీలంక ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. అక్కడ ఉప్పు సంక్షోభం తీవ్రమైంది. భారీ వర్షాల కారణంగా ఉప్పు ఉత్పత్తి నిలిచిపోగా, ఇతర ఉత్పత్తి చేసిన ఉప్పు కుప్పలు కూడా వర్షంలో కొట్టుకుపోయాయి. ఈ కారణంగా ద్వీప దేశం అవసరమైన పరిమాణంలో ఉప్పును కూడా ఉత్పత్తి చేయలేకపోతుంది. దీంతో ఉప్పు వంటి నిత్యావసర వస్తువుల గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉప్పు కొరత తీవ్రంగా ఉండటంతో దాని ధర మూడు నాలుగు రెట్లు పెరిగింది.

ప్రస్తుతం శ్రీలంకలో కిలో ఉప్పు రూ.125 నుంచి రూ.145 వరకు పలుకుతోంది. దేశంలో కేవలం 23 శాతం ఉప్పు మాత్రమే అక్కడ ఉత్పత్తి అవుతోంది. ఇదిలావుండగా శ్రీలంకకు భారత్ చేయూతనిచ్చింది. భారత్ 3050 మెట్రిక్ టన్నుల ఉప్పును శ్రీలంకకు పంపినప్పటికీ భారీ వర్షాల కారణంగా సరుకు రవాణా ఆలస్యమైంది. ఇందులో నేషనల్ సాల్ట్ కంపెనీ 2,800 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు రంగ కంపెనీలు 250 మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకున్నాయి. అయితే వచ్చే వారం నాటికి పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నారు.

30 వేల మెట్రిక్ టన్నుల నాన్ అయోడైజ్డ్ ఉప్పు దిగుమతిలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని, ఇది పరిస్థితిని మరింత దిగజార్చిందని ఉప్పు ఉత్పత్తిదారుల సంఘం పేర్కొంది. శ్రీలంక వాసులు ఖాళీ మార్కెట్ షెల్ఫ్‌ల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకోగా, మరికొందరు ఉప్పు కోసం వెతకాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

2022 నుంచి ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంకలో ఉప్పు కొరత కొత్త సమస్యగా మారింది. ఈ దేశం ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా కోలుకుంటోంది. 2022లో విదేశీ మారక నిల్వల కొరత కారణంగా శ్రీలంక చమురు, బొగ్గును దిగుమతి చేసుకోలేకపోయింది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.