SAIL Recruitment 2022: సెయిల్‌లో 259 ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ఇలా-sail recruitment 2022 apply for 259 consultant and other posts at sailcareers ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sail Recruitment 2022 Apply For 259 Consultant And Other Posts At Sailcareers

SAIL Recruitment 2022: సెయిల్‌లో 259 ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ఇలా

HT Telugu Desk HT Telugu
Nov 30, 2022 09:48 AM IST

SAIL Recruitment 2022: సెయిల్‌లో 259 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ డిసెంబరు 17న ముగియనుంది.

SAIL Recruitment 2022: 259 ఉద్యోగాలకు సెయిల్ నోటిఫికేషన్
SAIL Recruitment 2022: 259 ఉద్యోగాలకు సెయిల్ నోటిఫికేషన్ (HT file)

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) వివిధ పోస్టులకు గాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆయా పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు సెయిల్ కెరీర్స్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

నవంబరు 26న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు 17న ఈ ప్రక్రియ ముగుస్తుంది. మొత్తం 259 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Vacancy Details: సెయిల్ పోస్టుల ఖాళీల వివరాలు ఇవే

  • సీనియర్ కన్సల్టెంట్ : 2 పోస్టులు
  • కన్సల్టెంట్ సీనియర్/ మెడికల్ ఆఫీసర్: 8 పోస్టులు
  • మెడికల్ ఆఫీసర్: 5 పోస్టులు
  • మేనేజర్: 6 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్: 2 పోస్టులు
  • అసిస్టెంట్ మేనేజర్: 22 పోస్టులు
  • ఎస్3/ ఎస్1 గ్రేడ్స్ : 128 పోస్టులు
  • ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (Trainee): 24 పోస్టులు
  • అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (Trainee): 54 పోస్టులు

ఎస్-3 గ్రేడ్ పోస్టుల్లో మైన్స్ ఫోర్‌మెన్, సర్వేయర్, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్(ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్), ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (బాయిలింగ్ ఆపరేషన్) పోస్టులు ఉన్నాయి. ఎస్-1 గ్రేడ్ పోస్టుల్లో మైనింగ్ మేట్, బ్లాస్టర్, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేషన్) పోస్టులు ఉన్నాయి.

Eligibility Criteria: సెయిల్ పోస్టులకు అర్హతలు ఇవే

ఇక్కడ తెలిపిన సెయిల్ పోస్టులకు విద్యార్హతలు, వయో పరిమితుల కోసం ఈ కింద ఇచ్చిన లింక్‌ క్లిక్ సమగ్ర నోటిఫికేషన్ చూడండి. సెయిల్ విభిన్న పోస్టులకు విభిన్న విద్యార్హతలు, శారీరక ప్రమాణాలు నిర్దేశించింది.

దరఖాస్తు రుసుము ఇలా

ఈ1, ఆపై కేటగిరీల పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ. 700 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్3 పోస్టులైతే రూ. 500 చెల్లించాలి. ఎస్ 1 పోస్టులైతే రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సెయిల్ అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు.

IPL_Entry_Point

టాపిక్