SAIL Management Trainee Recruitment 2022: సెయిల్‌లో 245 పోస్టులు.. అప్లై ఇలా-sail management trainee recruitment 2022 for 245 post find full details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sail Management Trainee Recruitment 2022 For 245 Post Find Full Details Here

SAIL Management Trainee Recruitment 2022: సెయిల్‌లో 245 పోస్టులు.. అప్లై ఇలా

HT Telugu Desk HT Telugu
Nov 08, 2022 03:36 PM IST

SAIL Management Trainee Recruitment 2022: సెయిల్ మేనేజ్మెంట్ ట్రైనీ రిక్రూట్మెంట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

సెయిల్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
సెయిల్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

SAIL Management Trainee Recruitment 2022: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెయిల్ అధికారిక వెబ్‌సైట్ సెయిల్‌కెరీర్స్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

సెయిల్ మేనేజ్మెంట్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2022 కోసం దరఖాస్తుల ప్రక్రియ నవంబరు 3న ప్రారంభమైంది. నవంబరు 23న ముగియనుంది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 245 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అర్హతలు, ఎంపిక ప్రక్రియ ఇక్కడ చూడొచ్చు.

Eligibility Criteria: అర్హతలు ఇవే

అభ్యర్థులు 65 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్, కెమికల్, సివిల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మైనింగ్ తదితర ఏడు డిసిప్లిన్లలో ఒక దానిలో ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. గరిష్ట వయోపరిమితి నవంబరు 23, 2022 నాటికి 28 ఏళ్లుగా నిర్దేశించారు.

Selection Process: ఎంపిక ప్రక్రియ ఇదే

అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ గేట్ 2022 పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. షార్ట్ లిస్టయిన అభ్యర్థులకు సెయిల్ కెరీర్ వెబ్‌సైట్ ద్వారా తెలియపరుస్తారు. గ్రూప్ డిస్కషన్‌కు, ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

Application Fees: దరఖాస్తు రుసుము

దరఖాస్తు రుసుముగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 700 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం, అభ్యర్థులైతే రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు.

సమగ్ర ప్రకటన ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు.

IPL_Entry_Point

టాపిక్