Saffron blooms in Kashmir: కశ్మీర్లో విరగబూస్తున్న కుంకుమ పువ్వు-saffron blooms in kashmir production up by 30 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Saffron Blooms In Kashmir, Production Up By 30%

Saffron blooms in Kashmir: కశ్మీర్లో విరగబూస్తున్న కుంకుమ పువ్వు

HT Telugu Desk HT Telugu
Nov 03, 2022 09:11 PM IST

Saffron blooms in Kashmir: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమ పువ్వు ప్రధానమైనది. శీతల ప్రదేశాల్లో మాత్రమే ఈ పంట పండుతుంది. కశ్మీరీలకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఇది కూడా ఒకటి.

కుంకుమ పువ్వు పంట
కుంకుమ పువ్వు పంట

Saffron blooms in Kashmir: కుంకుమ పువ్వు ధర కేజీకి నాణ్యతను బట్టి సుమారు రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు ఉంటుంది. అయితే, కుంకుమ పువ్వులో ఉపయోగపడేది అందులోని ఎర్ర కేసరాలు మాత్రమే. వాటికే వాణిజ్య పరంగా విలువ ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Saffron blooms in Kashmir: 2 లక్షల పూలు

ఒక కిలో ఎర్ర కేసరాలు కావాలంటే దాదాపు 2 లక్షల పూలు అవసరమవుతాయి. అందువల్లనే వాటికి అంత ఖరీదు. ఈ ఎర్ర కేసరాలు రుచికి కొద్దిగా వగరుగా వుంటాయి. కుంకుమ పువ్వు గర్భిణులు ఆహారంలో తీసుకుంటే పుట్టే బిడ్డ తెల్లగా పుడతుందని విశ్వసిస్తారు.

Saffron blooms in Kashmir: కశ్మీర్లో ఆదాయ వనరు

కశ్మీరీలకు కుంకుమ పువ్వు పంట ప్రధాన ఆదాయ వనరు. దక్షిణ కశ్మీర్లో ఈ పంట అధికంగా పండుతుంది. ఈ పూలు పర్పుల్ రంగులో ఉంటాయి. వాటిలోని కేసరాలు కాషాయ రంగులో ఉంటాయి. ఈ సీజన్ లో ఈ కుంకుమ పూల పంట బావుందని, గతంలో కన్నా 30 శాతం అధికంగా దిగుబడి వచ్చిందని కశ్మీరీ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుంకుమ పువ్వు లోని ఎర్ర కేసరం ఎంత పొడవుగా ఉంటే అంత ఎక్కువ ధర వస్తుంది. ఈ సీజన్ లో ఈ కేసరాలు మంచి పొడవు వచ్చాయి. దాంతో, తమకు మెరుగైన లాభాలు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు.

కుంకుమ పువ్వు నుంచి కేసరాలను సేకరిస్తున్న దృశ్యం
కుంకుమ పువ్వు నుంచి కేసరాలను సేకరిస్తున్న దృశ్యం

Saffron blooms in Kashmir: 13 మెట్రిక్ టన్నులు

2020లో కశ్మీర్లో 13 మెట్రిక్ టన్నుల కుంకుమ పువ్వు ఉత్పత్తి అయింది. అంతకుముందు పదేళ్లలో అదే అత్యధిక దిగుబడి. ఈ సంవత్సరం ఆ రికార్డు బ్రేక్ అవుతుందని భావిస్తున్నారు. సాధారణంగా ఒక పంట నుంచి రెండు, మూడు సార్లు కుంకుమ పువ్వును సేకరిస్తారు.

IPL_Entry_Point