Sabarimala news today : ‘శబరిమల భక్తులకు తీవ్ర ఇబ్బందులు- వెంటనే పరిష్కరించండి’
Sabarimala news today : శబరిమలలో అయ్యప్ప భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టాలని కేరళ సీఎంకు లేఖ రాశారు కిషన్ రెడ్డి.
Sabarimala news today : అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల వెళుతున్న భక్తుల సౌకర్యాలను పెంచాలని కోరుతూ.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కి లేఖ రాశారు కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి. భక్తులకు త్వరగా దర్శనం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని, ఆలయంలో సిబ్బంది సంఖ్యను పెంచాలని విజ్ఞాప్తి చేశారు.
ఆహారం, నీరు, వైద్య సదుపాయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని పినరయి విజయన్ని అభ్యర్థించారు కిషన్ రెడ్డి.
"శబరిమల ఆలయంలో, ఆలయానికి వెళుతున్న మార్గంలో ఆయప్ప భక్తులు ఇబ్బందికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. భక్తుల కనీస సౌకర్యాలను మెరుగుపరచాలి," అని కేరళ సీఎంకు లేఖ్ రాశారు కేంద్రమంత్రి.
Sabarimala darshan latest news : "శబరిమల ఆలయంతో పాటు భక్తుల 40 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతియేటా కోటికి పైగా మంది భక్తులు శబరిమలను సందర్శిస్తారు. ఈ విషయం మీకు కూడా తెలుసు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే 15లక్షల మంది భక్తులు ఉంటారు. అయ్యప్ప సన్నిధిలో దర్శనానికి చాలా సమయం పడుతోందని నా దృష్టికి వచ్చింది. దర్శనానికి వెళుతున్న.. ఓ బాలిక ప్రాణాలు కోల్పోయిందన్న వార్త నన్ను కదిలించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ విధంగా చర్యలు తీసుకోండి. ఎన్జీఓల సాయం తీసుకునే ఆప్షన్ని పరిశీలించండి," అని లేఖలో పేర్కొన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ఇదీ చూడండి:- శబరిమలకి 18 సంఖ్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
శబరిమల ఆలయం వద్ద సౌకర్యాలు సరిగ్గా ఉండట్లేదని నివేదికలు వస్తున్నాయి. ఇదే విషయంపై.. హిందూ ఐక్య వేది అనే సంస్థ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవలే నిరసన చేపట్టింది. బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా విజయన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. అయితే.. ప్రభుత్వం మాత్రం, పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చెబుతోంది.
శబరిమలకు ప్రత్యేక రైళ్లు..
Sabarimala special trains from Hyderabad : శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. డిసెంబర్, జనవరి నెలల్లో 22 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించింది.
కింద్రాబాద్-కొల్లం, సికింద్రాబాద్-కొట్టాయం, కాకినాడ-కొట్టాయంల మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. నాలుగు రైళ్లు డిసెంబరు 27-30 తేదీల మధ్య.. 18 రైళ్లు జనవరి 3-15 మధ్య రాకపోకలు సాగించనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం