Ministry of sex : హనీమూన్​ ట్రిప్​కి ప్రభుత్వమే డబ్బులిస్తుంది! చేయాల్సిందల్లా ఆ ఒక్కటే..-russia considers creating ministry of sex couples to get honeymoon funds ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ministry Of Sex : హనీమూన్​ ట్రిప్​కి ప్రభుత్వమే డబ్బులిస్తుంది! చేయాల్సిందల్లా ఆ ఒక్కటే..

Ministry of sex : హనీమూన్​ ట్రిప్​కి ప్రభుత్వమే డబ్బులిస్తుంది! చేయాల్సిందల్లా ఆ ఒక్కటే..

Sharath Chitturi HT Telugu
Nov 12, 2024 10:35 AM IST

Ministry of sex in Russia : దేశ జనాభా క్షీణతను అడ్డుకునేందుకు రష్యా ప్రభుత్వం విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కొత్తగా ‘మినిస్ట్రీ ఆఫ్​ సెక్స్​’ పేరుతో ఒక ప్రత్యేక శాఖను తీసుకొచ్చి, ప్రజలను ఆకర్షించే ప్రయత్న చేయాలని చూస్తోంది.

ఈ దేశంలో కొత్తగా 'మినిస్ట్రీ ఆఫ్​ సెక్స్​' విభాగం!
ఈ దేశంలో కొత్తగా 'మినిస్ట్రీ ఆఫ్​ సెక్స్​' విభాగం!

దేశంలో క్షీణిస్తున్న జననాల రేటును ఎదుర్కోవడానికి “మినిస్ట్రీ ఆఫ్​ సెక్స్​”ని ఏర్పాటు చేయాలని రష్యా ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇలాంటి ఒక శాఖను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు రష్యా కుటుంబ రక్షణ, పితృత్వం, ప్రసూతి- బాల్యంపై రష్యా పార్లమెంటు కమిటీ చైర్ పర్సన్ అయిన నినా ఒస్టానినా వెల్లడించారు.

రష్యాలో జననాల రేటు ఆందోళనకర రీతిలో పడిపోతోంది. పైగా ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో భారీగా ప్రాణనష్టం కూడా సంభవిస్తోంది. ఈ నేపథ్యంలో జనాభా క్షీణతను అడ్డుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఇందులో భాగంగా రష్యా ప్రభుత్వం వివిధ వ్యూహాలపై ఫోకస్​ చేసింది.

మోస్క్విచ్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం, గ్లావ్​పీఆర్ అనే ఏజెన్సీ ఈ “మినిస్ట్రీ ఆఫ్​ సెక్స్” ఐడియాతో వచ్చింది.

ప్రతిపాదిత మినిస్ట్రీ ఏం చేస్తుంది?

- జంటలు సన్నిహిత కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడానికి రాత్రి 10 గంటల నుంచ తెల్లవారుజామున 2 గంటల మధ్య ఇంటర్నెట్, లైట్లను కూడా ఆపివేయాలనే ఒక అసాధారణ ప్రతిపాదన కూడా ఇందులో ఉంది!

- ఇంటి పని కోసం ఇంట్లో ఉండే తల్లులకు డబ్బు చెల్లించాలి! ఈ సంపాదన వారి పెన్షన్ లెక్కలకు దోహదం చేస్తుంది. కుటుంబ సంబంధాలను పెంపొందించడానికి 5,000 రూబుల్స్ (£40) వరకు నిధులు సమకూర్చాలని ప్రభుత్వానికి సిఫార్సులు అందాయి.

- గర్భధారణను ప్రోత్సహించడానికి 26,300 రూబుల్స్ విలువ గల ‘హనీమూన్​ ఫండ్​’ని వివాహ-రాత్రి హోటల్ బసల కోసం దంపతులకు ప్రభుత్వం ఇస్తుంది!

- ఖబరోవ్స్కోలో 18 నుంచి 23 సంవత్సరాల వయస్సు గల మహిళా విద్యార్థులు బిడ్డను కనేందుకు అక్కడి ప్రభుత్వం £900 ఇస్తోంది. చెల్యాబిన్స్కోలో మొదటి బిడ్డకు £8,500 అందుతోంది.

- రష్యన్లు "సంతానోత్పత్తి" కోసం పని ప్రదేశాల్లో కాఫీ, భోజన విరామాలను ఉపయోగించాలని ప్రాంతీయ ఆరోగ్య మంత్రి యెవ్జెనీ షెస్టోపలోవ్ సూచించారు.

మహిళల వ్యక్తిగత జీవితాలపై అధికారులు ఆరా..

మాస్కోలో అధిక జననాల రేటును ప్రోత్సహించేందుకు అధికారులు మహిళల వ్యక్తిగత జీవితాలపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ రంగంలోని మహిళా ఉద్యోగులకు సంబంధించిన లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం గురించి వివరణాత్మక ప్రశ్నావళిని ప్రభుత్వం సిద్ధం చేశారు. ఇది రష్యా అంతటా విస్తృత డేటా సేకరణ ప్రణాళికను సూచిస్తుంది. స్పందించని వారు డాక్టర్ అపాయింట్మెంట్లకు తప్పనిసరిగా హాజరు కావాలి, అక్కడ అడిగే ప్రశ్నలు..

  • మీరు లైంగిక చర్యను ఎప్పుడు ప్రారంభించారు?
  • మీరు కండోమ్లు లేదా హార్మోన్ల జనన నియంత్రణను ఉపయోగిస్తారా?
  • సంభోగం సమయంలో మీరు నొప్పి లేదా రక్తస్రావాన్ని అనుభవిస్తున్నారా?
  • మీరు ఇప్పటికే గర్భం దాల్చారా? అలా అయితే, ఎన్నిసార్లు?
  • మీకు పిల్లలు ఎవరైనా ఉన్నారా, లేదా వచ్చే సంవత్సరంలో ప్లాన్ చేస్తున్నారా?

ఈ వివరాలను తమ హెచ్​ఆర్ విభాగాలకు అందించాలని కోరడంతో ప్రభుత్వ సాంస్కృతిక సంస్థల్లోని మహిళా ఉద్యోగులు విసుగు చెందినట్లు సమాచారం.

ఈ ప్రశ్నలకు వ్యక్తిగతంగా సమాధానం ఇవ్వడానికి వారు రాష్ట్ర వైద్యులతో ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. మాస్కోలో ఉచిత సంతానోత్పత్తి పరీక్షా కార్యక్రమాన్ని ఇప్పటి వరకు 20,000 మంది మహిళలు చేపట్టారు.

Whats_app_banner

సంబంధిత కథనం