Russia's New General : రష్యా దళాలకు కొత్త కమాండర్-russia appoints new general to lead offensive in ukraine after setbacks ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Russia Appoints New General To Lead Offensive In Ukraine After Setbacks

Russia's New General : రష్యా దళాలకు కొత్త కమాండర్

HT Telugu Desk HT Telugu
Oct 08, 2022 09:40 PM IST

Russia's New General : ఉక్రెయిన్ తో యుద్ధంలో ఊహించని ఎదురు దెబ్బలు తింటున్న రష్యా దళాలకు సరికొత్త ఉత్సాహం తెచ్చే దిశగా అధ్యక్షుడు పుతిన్ ఒక నిర్ణయం తీసుకున్నారు.

ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యా కొత్త కమాండర్ జనరల్ సెర్గీ సురొవికిన్
ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యా కొత్త కమాండర్ జనరల్ సెర్గీ సురొవికిన్

Russia's New General : కొద్ది రోజుల్లోనే ముగించగలమన్న నమ్మకంతో ప్రారంభించిన మిలటరీ ఆపరేషన్ నెలల తరబడి కొనసాగుతుండడంతో పాటు, ఉక్రెయిన్ దళాల నుంచి ఊహించని ఎదురుదాడి ఎదురవుతుండడంతో రష్యా కొత్త వ్యూహాలకు పదును పెడ్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Russia's New General : కొత్త జనరల్

ఉక్రెయిన్ లో దాడులకు నేతృత్వం వహించడానికి కొత్త జనరల్ ను అధ్యక్షుడు పుతిన్ నియమించారు. ఈ కొత్త జనరల్ రష్యా దళాలకు నాయకత్వం వహిస్తాడు. జనరల్ సెర్గీ సురొవికిన్ ను "commander of the Joint Grouping of Forces in the areas of the special military operation" గా నియమించారు. 1990ల నాటి తజకిస్తాన్, చెచెన్యా యుద్ధాల్లో, ఇటీవలి సిరియా యుద్ధంలో జనరల్ సెర్గీ కీలక పాత్ర పోషించారు.

Russia's New General : రష్యా వెనుకడుగు..

ఈ మధ్య కాలంలో యుద్ధంలో ఉక్రెయిన్ వ్యూహాత్మక దాడులు చేస్తుండడంతో రష్యా కొన్ని ఎదురు దెబ్బలు తిన్నది. తాజాగా క్రిమియాను రష్యాతో కలిపే కీలక వంతెనను కూడా ఉక్రెయిన్ కూల్చేసింది. ఈ నేపథ్యంలో సరికొత్త యుద్ధ వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరం రష్యాకు ఏర్పడింది.

IPL_Entry_Point