Rupert Murdoch : 92ఏళ్ల వయస్సులో నిశ్చితార్థం.. త్వరలోనే 5వ పెళ్లి!-rupert murdoch gets engaged at 92 to elena zhukova set to marry for 5th time ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rupert Murdoch : 92ఏళ్ల వయస్సులో నిశ్చితార్థం.. త్వరలోనే 5వ పెళ్లి!

Rupert Murdoch : 92ఏళ్ల వయస్సులో నిశ్చితార్థం.. త్వరలోనే 5వ పెళ్లి!

Sharath Chitturi HT Telugu

Rupert Murdoch marriage : రూపర్ట్​ ముర్డోక్​.. 5వసారి పెళ్లికి సిద్ధమవుతున్నారు. 92ఏళ్ల వయస్సు గల మీడియా మొఘల్​ రూపర్ట్​.. తాను డేటింగ్​ చేస్తున్న మహిళతో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు.

మళ్లీ పెళ్లికి రెడీ అవుతున్న రూపర్ట్ ముర్డోక్! (Reuters)

Rupert Murdoch engagement : మీడియా మొఘల్​ రూపర్ట్ ముర్డోక్.. తన ప్రియురాలు ఎలెనా జుకోవాతో నిశ్చితార్థం చేసుకున్నారు. 92 ఏళ్ల రూపర్ట్​.. ఐదోవసారి పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు! కాలిఫోర్నియాలోని తన ఎస్టేట్ మొరాగాలో ఈ వివాహం జరగనుంది.

రూపర్ట్​ మూర్డోక్​.. ఫాక్స్ అండ్ న్యూస్ కార్ప్ చైర్మన్ పదవి నుంచి కొన్ని నెలల క్రితమే వైదొలిగారు.

ఎవరీ.. ఎలెనా జుకోవా?

ఎలెనా జుకోవా మాస్కోకు చెందిన మహిళ. 67ఏళ్ల ఎలెనా.. ఒక రిటైర్డ్​ మాలిక్యులర్​ బయోలజిస్ట్​. రూపర్ట్​ ముర్డోక్​, ఎలెనాలు ఏడాది కాలంగా డేటింగ్​ చేస్తున్నట్టు సమాచారం. రూపర్ట్ ముర్డోక్ మూడో భార్య వెండీ డెంగ్ ద్వారా వీరిద్దరూ కలుసుకున్నట్టు సమాచారం!

Rupert Murdoch Elena Zhukova : ఇక రూపర్ట్​ ముర్డోక్​కు ఇది ఐదొవ పెళ్లి. నటి మోడల్ జెర్రీ హాల్​తో ఆయన నాల్గోవ వివాహం జరిగింది. ఆరు సంవత్సరాల తరువాత 2022లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. సాన్​ఫ్రాన్సిస్కో మాజీ పోలీసు చాప్లిన్ ఆన్ లెస్లీ స్మిత్​తో కూడా ఈ మీడియా మొఘల్​ కొంతకాలం క్రితం నిశ్చితార్థం చేసుకున్నారు. ఆయన ఇతర మాజీ జీవిత భాగస్వాములు.. ఆస్ట్రేలియన్ ఫ్లైట్ అటెండెంట్ పాట్రిసియా బుకర్, స్కాటిష్​లో జన్మించిన జర్నలిస్ట్ అన్నా మాన్, డెంగ్​, అమెరికా మోడల్- నటి జెర్రీ హాల్.

రూపర్ట్ ముర్డోక్ కెరీర్..

ముర్డోక్ 1950వ దశకంలో ఆస్ట్రేలియాలో తన కెరీర్​ను ప్రారంభించారు. అతను 1969లో యుకేలో న్యూస్ ఆఫ్ ది వరల్డ్, ది సన్ వార్తాపత్రికలను కొనుగోలు చేశారు. న్యూయార్క్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్​తో సహా అనేక యూఎస్ పబ్లికేషన్స్​ని కూడా కొన్నారు.

Rupert Murdoch marriage : 1996 లో ఫాక్స్ న్యూస్​ని ప్రారభించారు మీడియా మొఘల్​ రూపర్ట్​. 2013 లో న్యూస్ కార్ప్​ని స్థాపించారు. తన మీడియా సామ్రాజ్యంలో ప్రధాన పాత్రల నుంచి తప్పుకుంటున్నట్లు.. రూపర్ట్ ముర్డోక్ గత ఏడాది ప్రకటించారు. ఆయన తన కుమారుడు లాచ్లాన్​కు పగ్గాలు అప్పగించారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.