Dollar vs Rupee : రూపాయి విలువ పాతాళంలోకి.. ఆల్ టైమ్ రికార్డు 77.82-rupee hits record low of 77 82 against us dollar in early trade ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rupee Hits Record Low Of 77.82 Against Us Dollar In Early Trade

Dollar vs Rupee : రూపాయి విలువ పాతాళంలోకి.. ఆల్ టైమ్ రికార్డు 77.82

Praveen Kumar Lenkala HT Telugu
Jun 10, 2022 09:57 AM IST

రూపాయి ఆల్ టైమ్ కనిష్టానికి దిగజారింది. డాలరుతో పోల్చితే 77.82కి పడిపోయింది.

రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పతనం
రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పతనం (REUTERS)

ముంబై, జూన్ 10: రూపాయి విలువ శుక్రవారం ఉదయం ఆరంభ ట్రేడింగ్‌లో మరో 8 పైసలు దిగజారి రికార్డు స్థాయి దిగువన 77.82కు పడిపోయింది. డాలర్ బలోపేతమవుతున్న కొద్దీ రూపాయి బలహీనపడుతోంది.

ట్రెండింగ్ వార్తలు

ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ వద్ద డాలరుతో పోలిస్తే రూపాయి మారక విలువ 77.81 వద్ద ఓపెన్ అయ్యింది. క్రమంగా 77.82 వద్ద రికార్డుస్తాయి దిగువకు జారుకుంది. రూపాయి విలువ ఇంత దిగువకు పతనం అవడం ఇదే మొదటిసారి. క్రితం రోజు ముగింపుతో పోలిస్తే 8 పైసలు బలహీనపడింది.

గురువారం డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 6 పైసలు బలహీనపడి 77.74కు పతనమైంది.

‘శుక్రవారం ఉదయం రూపాయి మరింత బలహీనపడింది. అంతర్జాతీయ మార్కెట్లలో డాలరు పుంజుకోవడమే ఇందుకు కారణం.’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ శ్రీరాం అయ్యర్ తెలిపారు.

‘ఏషియా మార్కెట్లు, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మార్కెట్లు మిశ్రమంగా ఓపెన్ అయ్యాయి. అయితే ఏషియన్ ఈక్విటీలు ఇప్పటికీ ఒత్తిడిలోనే ఉన్నాయి. ఇది సెంటిమెంట్లను బలహీనపరుస్తోంది..’ అని అయ్యర్ అన్నారు.

అంతర్జాతీయ చమురు బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.66 శాతం పడిపోయి బారెల్ చమురు ధర 122.26 డాలర్ల వద్ద పలికింది.

మరోవైపు డాలర్ ఇండెక్స్ 0.04 శాతం దిగువన ట్రేడవుతూ 103.17 పాయింట్ల వద్ద ఉంది.

ఇక దేశీయ మార్కెట్లలో శుక్రవారం ఉదయం సెక్సెక్స్ భారీగా పడిపోయింది. సెన్సెక్స్ 620.68 పాయింట్లు కోల్పోయి 54,699.60 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 165.30 పాయింట్లు కోల్పోయి 16,312.80 వద్ద ట్రేడవుతోంది.

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు క్యాపిటల్ మార్కెట్ నుంచి గురువారం మరో రూ. 1,512 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేసి నికర అమ్మకందారులుగా నిలిచారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నికర కొనుగోలుదారులుగా ఉన్నప్పుడు క్రమంగా రూపాయి విలువ పుంజుకునే అవకాశం ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్