Rupee record low: ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి.. -rupee hits new record low as us currency surges globally ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Rupee Hits New Record Low As Us Currency Surges Globally

Rupee record low: ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి..

డాలరుతో పోలిస్తే జీవితకాలపు కనిష్టానికి దిగజారిన రూపాయి
డాలరుతో పోలిస్తే జీవితకాలపు కనిష్టానికి దిగజారిన రూపాయి (REUTERS)

ముంబై, జూలై 12: భారతీయ కరెన్సీ రూపాయి మరోసారి జీవితకాలపు కనిష్టానికి పతనమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు బలహీనపడడంతో అమెరికన్ కరెన్సీ డాలర్ బలపడింది.

Dollar Rate today: ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజీ వద్ద అమెరికన్ డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం ఒక దశలో 79.66కు పడిపోయింది. అయితే చివరకు క్రితం రోజు ముగింపు 79.45తో పోలిస్తే 15 పైసలు కోల్పోయి 79.60 వద్ద ముగిసింది.

ట్రెండింగ్ వార్తలు

ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు బలహీనపడ్డాయి. దీంతో ప్రధానమైన గ్లోబల్ కరెన్సీలతో పోల్చితే అమెరికన్ డాలరు బలపడింది. యూరో 1.00005కు పడిపోయింది. 2002 నుంచి ఇంత దిగువకు దిగి రావడం ఇదే మొదటిసారి. డాలరుకు సమానంగా పడిపోవడం రెండు దశాబ్దాల్లో ఇది తొలిసారి.

భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం 1 శాతం మేర నష్టపోయాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనపడడంతో, ముఖ్యంగా ఐటీ, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు నష్టపోయాయి.

సెన్సెక్స్ 508.62 పాయింట్లు నష్టపోయి 53,886.61 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 157.70 పాయింట్లు నష్టపోయి 16,058.30 పాయింట్ల వద్ద ముగిసింది.

ట్రేడ్ డెఫిసిట్‌లో పెరుగుదల భారతీయ కరెన్సీపై ఒత్తిడి పెంచుతోంది. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ ఇటీవలి డేటా ప్రకారం జూన్ మాసంలో ఇండియా ట్రేడ్ డెఫిసిట్ 25.63 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో ట్రేడ్ డెఫిసిట్ 70.25 బిలియన్ డాలర్లకు పెరిగింది.

దిగుమతులు పెరగడం కారణంగా దేశపు ట్రేడ్ డెఫిసిట్ పెరిగింది. భారత దేశపు వాణిజ్య దిగుమతులు ఏప్రిల్-.జూన్ క్వార్టర్‌లో 187.02 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది 47.31 శాతం పెరుగుదలకు సమానం. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో దిగుమతులు 126.96 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఫస్ట్ క్వార్టర్‌లో ఇండియా వాణిజ్య ఎగుమతులు 116.77 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్‌తో పోల్చితే పెరుగుదల 22.22 శాతంగా నమోదైంది.

జూన్ నెలలో వాణిజ్య ఎగుమతులు 16.8 శాతం పెరిగాయి. అదే సమయంలో దిగుమతులు 51.02 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో ట్రేడ్ డెఫిసిట్ 25.63 బిలియన్ డాలర్లుగా ఉంది.

WhatsApp channel

టాపిక్