Rupee gains: గుడ్ న్యూస్.. 30 పైసలు బలపడిన రూపాయి-rupee gains 30 paise to 79 39 against us dollar in early trade ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Rupee Gains 30 Paise To 79.39 Against Us Dollar In Early Trade

Rupee gains: గుడ్ న్యూస్.. 30 పైసలు బలపడిన రూపాయి

బలపడిన రూపాయి విలువ
బలపడిన రూపాయి విలువ (PTI)

Rupee gains: డాలరుతో పోల్చితే రూపాయి విలువ 30 పైసలు బలపడి 79.39కి చేరింది.

Rupee gains: డాలరుతో పోల్చితే రూపాయి విలువ శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 30 పైసలు బలపబడి 79.39కి చేరింది. దేశీయ మార్కెట్లలోకి విదేశీ నిధుల ప్రవాహం తిరిగి మొదలవడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

దీనికి తోడు డాలర్ బలహీనత కారణంగా దేశీయ కరెన్సీ రూపాయి కాస్త బలపడినట్టు కనిపిస్తోందని ట్రేడర్లు విశ్లేషించారు.

ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ వద్ద రూపాయి 79.55 వద్ద ఓపెన్ అయ్యింది. ఆరంభ డీల్స్‌లో 79.39 వరకు బలపడింది. క్రితం ముగింపుతో పోలిస్తే 30 పైసలు బలపడింది. క్రితం సెషన్‌లో రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 79.69 వద్ద ముగిసింది.

దేశీయ మార్కెట్లలో శుక్రవారం సెన్సెక్స్ 594.25 పాయింట్లు లాభపడి 57,452.04 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 182.85 పాయింట్ల మేర బలపడి 17,112.45 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే డాలర్ ఇండెక్స్ 0.30 పాయింట్లు కోల్పోయి 106.03 పాయింట్ల వద్ద ఉంది.

గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.11 శాతం పడిపోయి బ్యారెల్ ధర 107.02 డాలర్లుగా ట్రేడవుతోంది

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గురువారం రూ. 1,637.69 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసి నికర కొనుగోలుదారులుగా నిలిచారు.

యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్ సౌగత భట్టాచార్య మాట్లాడుతూ ఆర్‌బీఐ మానిటరింగ్ కమిటీ వచ్చే వారం 0.35 నుంచి 0.50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటు పెంచే అవకాశం ఉందని చెప్పారు.

టాపిక్