‘RRR’ centres in U.P.: యూపీలోని 11 నగరాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సెంటర్స్; ఎంటీ ‘ఆర్ఆర్ఆర్’ సెంటర్స్ స్పెషాలిటీ?-rrr centres to come up in 11 municipal corporations in up ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  'Rrr' Centres To Come Up In 11 Municipal Corporations In U.p.

‘RRR’ centres in U.P.: యూపీలోని 11 నగరాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సెంటర్స్; ఎంటీ ‘ఆర్ఆర్ఆర్’ సెంటర్స్ స్పెషాలిటీ?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

‘RRR’ centres in U.P.: రాష్ట్రంలోని 11 నగరాల్లో ఆర్ఆర్ఆర్ (RRR) సెంటర్స్ ను ఏర్పాటు చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ‘ఆర్ (Reduce), ఆర్ (Reuse), ఆర్ (Recycle)’ కేంద్రాల నిర్వహణను స్వచ్ఛంధ సంస్థలకు, స్వయం సహాయక బృందాలకు అప్పగించాలని యోచిస్తోంది.

‘RRR’ centres in U.P.: రాష్ట్రంలోని 11 నగరాల్లో ఆర్ఆర్ఆర్ (RRR) సెంటర్స్ ను ఏర్పాటు చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ‘ఆర్ (Reduce), ఆర్ (Reuse), ఆర్ (Recycle)’ కేంద్రాల నిర్వహణను స్వచ్ఛంధ సంస్థలకు, స్వయం సహాయక బృందాలకు అప్పగించాలని యోచిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

‘RRR’ centres in U.P.: నాటు నాటు స్ఫూర్తితో..

ఇళ్లల్లో నిరుపయోగంగా ఉన్న దుస్తులు, పుస్తకాలు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రికల్ సామగ్రి.. మొదలైన వాటిని సేకరించి ఈ ‘ఆర్ (Reduce), ఆర్ (Reuse), ఆర్ (Recycle)’ కేంద్రాల ద్వారా అవసరమైన వారికి అందిస్తారు. పౌరుల ఇళ్లల్లో నుంచి ఈ వస్తువులను సేకరించడానికి వాహనాలను సమకూరుస్తారు. ఆ ఆర్ఆర్ఆర్ (RRR) సెంటర్స్ ను తెలుగు బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ ఆర్ ఆర్ (RRR) లోని ఆస్కార్ పురస్కారాన్ని సాధించిన పాట నాటు నాటు (Natu Natu song) స్ఫూర్తితో ‘‘నా త్రో (Na Throw).. నా త్రో (Na Throw)’’ అనే పేరుతో వ్యవహరిస్తారు.

‘RRR’ centres in U.P.: 11 నగరాల్లో..

ఉత్తర ప్రదేశ్ లోని లక్నో, కాన్పూర్, వారణాసి, మీరట్, ఆగ్రా, ఘజియాబాద్, ప్రయాగరాజ్, అలీగఢ్, బరేలీ, మొరాదాబాద్, సహారన్ పూర్ నగరాల్లో ఈ ‘ఆర్ (Reduce), ఆర్ (Reuse), ఆర్ (Recycle)’ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ (urban 2.0) కింద మేరీ లైఫ్.. మేరా స్వచ్ఛ షెహర్ (Meri Life, Mera Swachh Shehar) ప్రచారంలో భాగంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని మే 20వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఇల్లు, వ్యాపార సముదాయాల నుంచి సేకరించిన.. వారికి ఉపయోగంలో లేని వస్తువులను.. ఆయా వస్తువులు అవసరమైన వారికి ఇవ్వడం గానీ, లేదా రీసైకిల్ చేయడం గానీ చేస్తారు.

COW DUNG BANK: ఆవు పేడ బ్యాంక్

లక్నో లో ఆవు పేడ బ్యాంక్ (COW DUNG BANK) ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమీప ప్రాంతాల నుంచి సేకరించిన ఆవు పేడను ఈ బ్యాంక్ లో భద్రపర్చి, అనంతరం దానితో పర్యావరణ హిత ప్రొడక్ట్స్ ను తయారు చేస్తారు.

WhatsApp channel