Roadside bomb kills 6: రోడ్డు పక్కన పేలిన బాంబు; ఆరుగురి దుర్మరణం-roadside bomb kills 6 in north afghanistan
Telugu News  /  National International  /  Roadside Bomb Kills 6 In North Afghanistan
అఫ్గాన్ లో జరిగిన బాంబు దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తులు
అఫ్గాన్ లో జరిగిన బాంబు దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తులు (AP)

Roadside bomb kills 6: రోడ్డు పక్కన పేలిన బాంబు; ఆరుగురి దుర్మరణం

06 December 2022, 19:51 ISTHT Telugu Desk
06 December 2022, 19:51 IST

Roadside bomb kills 6: ప్రభుత్వ ఉద్యోగులున్న బస్సు వెళ్తుండగా బాంబు పేలడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మంగళవారం ఆఫ్గానిస్తాన్ లో జరిగింది.

Afghan bomb blast: అఫ్గానిస్తాన్ లోని బాల్క్ రాష్ట్ర రాజధాని మజారి షరీఫ్ పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగులతో వెళ్తున్న బస్సు పక్కన బాంబు పేలడంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో ఉన్న వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

Roadside bomb kills 6: రోడ్డు పక్కన బాంబు

ప్రభుత్వ ఉద్యోగులతో వెళ్తున్న బస్సుకు సమీపంలో ఈ బాంబు పేలింది. చాలా శక్తిమంతమైన బాంబు కావడంతో, బస్సు పూర్తిగా ధ్వంసమైంది. బస్సులోని ఉద్యోగుల్లో ఆరుగురు చనిపోయారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు పక్కన ఒక చక్రాల బండిని నిలిపి, అందులో ఈ శక్తిమంతమైన బాంబును అమర్చారు. హియారతన్ గ్యాస్, పెట్రోలియం డిపార్ట్ మెంట్ కు చెందిన బస్సు ఆ బండి పక్కనుంచి వెళ్తుండగా, రిమోట్ తో ఆ బండిలోని శక్తిమంతమైన బాంబును పేల్చారు. దాంతో, బస్సు పూర్తిగా ధ్వంసమైంది. మరో ఘటనలో జలాలాబాద్ పట్టణంలో ఉన్న మనీ ఎక్స్చేంజ్ మార్కెట్ లో జరిగిన బాంబు దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు పేలుళ్లకు కూడా ఇప్పటివరకు ఎవరూ బాధ్యత తీసుకుంటున్నట్లు ప్రకటించలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఆఫ్గాన్ లో పలు బాంబు దాడులకు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ పాల్పడింది. అఫ్గాన్ లో అధికారంలో ఉన్న తాలిబన్ కు ఈ ఇస్లామిక్ స్టేట్ వ్యతిరేకంగా పని చేస్తోంది. 2021 నుంచి అఫ్గాన్ లో దాడులను ఈ ఇస్లామిక్ స్టేట్ తీవ్రం చేసింది.