Road accidents: రోడ్లు మింగేసిన ప్రాణాలు 1.5 లక్షలు..-road accidents due to use of mobile phones claimed over 1k deaths report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Road Accidents Due To Use Of Mobile Phones Claimed Over 1k Deaths: Report

Road accidents: రోడ్లు మింగేసిన ప్రాణాలు 1.5 లక్షలు..

HT Telugu Desk HT Telugu
Jan 06, 2023 04:47 PM IST

Road accidents: దేశంలో రోడ్డు ప్రమాదాల డేటాను రోడ్ రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ వాడడం వల్ల 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Road accidents: 2021 సంవత్సరానికి గానూ రోడ్డు ప్రమాదాల వివరాలను ఒక ‘రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా -2021’ (Road accidents in India--2021) పేరుతో రూపొందించిన ఒక నివేదికలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఆ సంవత్సరం డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్స్ వాడడం వల్ల మొత్తంగా 1997 రోడ్డు ప్రమాదాలు జరిగాయిని తెలిపింది. ఈ యాక్సిడెంట్స్ లో మొత్తం 1040 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

Road accidents: రెడ్ లైట్ జంపింగ్

ట్రాఫిక్ పోలీస్ కనిపించకపోతే, రెడ్ లైట్ ను జంప్ చేయడం చాలా మంది వాహన దారులకు అలవాటే. రెడ్ లైట్ పడిన సమయంలో వాహనాన్ని నిలపకుండా, వేగంగా ముందుకు వెళ్లడం వల్ల 2021 సంవత్సరంలో మొత్తం 555 రోడ్డు ప్రమాదాలు జరగగా, 221 మంది చనిపోయారు. అలాగే, రోడ్లపై గుంతల వల్ల 2021లో అత్యధికంగా 3,625 ప్రమదాలు జరిగాయి. 1481 మంది దుర్మరణం పాలయ్యారు.

Road accidents: జాగ్రత్తలు తీసుకోవాలి..

రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి, రోడ్డు ప్రమాద మరణాలను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలని నివేదిక పేర్కొంది. వాహన దారుల నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల జరిగే ప్రమాదాలను వారిలో, అవగాహన కల్పించడం ద్వారా, అలాగే జరిమానా వసూలు చేయడం, జైలుశిక్ష విధించడం వంటి కఠిన శిక్షలు అమలు చేయడం ద్వారా నివారించవచ్చని సూచించింది. రోడ్డును నిర్మించే సమయంలోనే ప్రమాదాల నివారణకు సంబంధించిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని పేర్కొంది.

Road accidents: 4 లక్షల ప్రమాదాలు

కేంద్ర రహదారుల శాఖ నివేదిక ప్రకారం.. 2021లో మొత్తంగా 4, 12, 432 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదాల్లో 1,53,972 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,84,448 మంది గాయాలపాలయ్యారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ శాఖ ల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించారు.

IPL_Entry_Point

టాపిక్