Boy who has higher IQ than Einstein: ఈ బాలుడి ఐక్యూ ఐన్ స్టీన్ కన్నా ఎక్కువ-rishi shiv who received bal puraskar has higher iq then albert einstein ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Boy Who Has Higher Iq Than Einstein: ఈ బాలుడి ఐక్యూ ఐన్ స్టీన్ కన్నా ఎక్కువ

Boy who has higher IQ than Einstein: ఈ బాలుడి ఐక్యూ ఐన్ స్టీన్ కన్నా ఎక్కువ

HT Telugu Desk HT Telugu
Jan 24, 2023 07:59 PM IST

Boy who has higher IQ than Einstein: ఐక్యూ (IQ). ఇంటలిజెంట్ కోషియంట్ (Intelligence Quotient - IQ). తెలివితేటలను నిర్ధారించే ఈ ఐక్యూ (Intelligence Quotient - IQ) ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్ స్టీన్ లో అత్యధికమని భావిస్తుంటారు. తాజాగా మన బెంగళూరుకు చెందిన బాలుడు రిషి శివ ప్రసన్న (Rishi Shiv Prasanna) కు ఐన్ స్టీన్ కు మించిన ఐక్యూ (IQ) ఉందని తేలింది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డ్ స్వీకరిస్తున్న రుషి శివ ప్రసన్న
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డ్ స్వీకరిస్తున్న రుషి శివ ప్రసన్న (PTI)

Boy who has higher IQ than Einstein: రిషి శివ ప్రసన్న బెంగళూరుకు చెందిన 8 ఏళ్ల బాలుడు. ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డును పొందాడు.ఈ బాలుడి ఐక్యూ (IQ) ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్ స్టీన్ ఐక్యూ కన్నా ఎక్కువ అని తేలింది. దాంతో, రిషి శివ ప్రసన్న (Rishi Shiv Prasanna) కు ప్రఖ్యాత మెన్సా ఇంటర్నేషనల్ (Mensa International) లో సభ్యత్వం లభించింది. ఈ Mensa International లో సభ్యత్వం పొందిన అత్యంత పిన్న వయస్కుడు రిషి శివ ప్రసన్న (Rishi Shiv Prasanna)నే కావడం విశేషం. మెన్సా ఇంటర్నేషనల్ (Mensa International) లో సాధారణంగా అత్యధిక ఐక్యూ (Intelligence Quotient - IQ) ఉన్న వారికే సభ్యత్వం లభిస్తుంది.

Boy who has higher IQ than Einstein: మూడు ఆండ్రాయిడ్ యాప్స్ సృష్టికర్త

రిషి శివ ప్రసన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రతిష్టాత్మక ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డును అందుకున్నాడు. రిషి శివ ప్రసన్న 8 ఏళ్ల చిన్న వయస్సులోనే 3 ఆండ్రాయడ్ యాప్స్ (Android apps) ను రూపొందించి చరిత్ర సృష్టించాడు. ఈ బాలుడి ఐక్యూ (Intelligence Quotient - IQ) 180. ఇది ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్ స్టీన్ ఐక్యూ (IQ) అయిన 160 కన్నా 20 పాయింట్లు ఎక్కువ. సాధారణంగా చాలా మందికి 85 నుంచి 115 మధ్య ఐక్యూ (Intelligence Quotient - IQ) ఉంటుంది. ఒకవేళ ఎవరికైన 130 ఐక్యూ (Intelligence Quotient - IQ) ఉంటే వారిని అత్యంత తెలివైన వారిగా పరిగణిస్తారు.

Boy who has higher IQ than Einstein: ఐదేళ్ల వయస్సుకే కోడింగ్

ఈ రుషి శివప్రసన్న ఐదేళ్ల వయస్సుకే కోడింగ్ (coding) నేర్చుకున్నాడు. ఈ బాలుడు అత్యంత పిన్న వయస్కుడైన యూట్యూబర్ (YouTuber) కూడా. తన యూట్యూబ్ వీడియోస్ లో సైన్స్ కు సంబంధించిన విశేషాలను పంచుకుంటుంటాడు. మూడేళ్ల వయస్సు నుంచే ఈ బాలుడు సౌర వ్యవస్థ, గ్రహాలు, విశ్వం.. తదితర అంశాల గురించి మాట్లాడడం ప్రారంభించాడట. ఐదేళ్ల వయస్సులో కోడింగ్ నేర్చుకున్న ప్రసన్న.. పలు యాప్ లను రూపొందించాడు. వాటిలో పిల్లలకు ఉపయోగపడే “IQ Test App”, “Countries of the world”, “CHB.” యాప్స్ చాలా పాపులర్. పుస్తకాలు చదవడం ద్వారానే నాలెడ్జ్ ను సంపాదించగలమని, పుస్తక పఠనం ద్వారా ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వగలమని 2021లో ఒక ఇంటర్వ్యూలో ప్రసన్న చెప్పాడు. ‘రెండు గంటల పాటు మీరు ఏదో ఒకటి చదవనట్లైతే.. ఆ తరువాత నాలుగు గంటల పాటు మీరు నిరక్షరాస్యులుగా ఉన్నట్లే’ అని ఆ బాలుడు వ్యాఖ్యానించాడు. ఈ సంవత్సరం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 5 నుంచి 18 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న, వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 11 మంది పిల్లలకు లభించింది.

Whats_app_banner