Petrol diesel price : దేశంలో పెట్రోల్- డీజిల్ ధరలు తగ్గుతాయా?
Petrol diesel price today : అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. మరి దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
Petrol diesel price : ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు.. గత కొన్ని నెలలతో పోల్చుకుంటే భారీగా పతనమయ్యాయి. మరి దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతోంది. అయితే.. ఇప్పట్లో పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని తెలుస్తోంది.
పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్(ఏవియేషన్ టర్బైన్) వంటి పెట్రోలియం ఉత్పత్తులపై వచ్చే వారంలో కేంద్రం సమీక్ష నిర్వహించనుంది. ఇందులో భాగంగా.. ఆయా పెట్రోలియం ఉత్పత్తులపై విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌పైనా సమీక్ష చేయనుంది. ఇదే సమయంలో రీటైల్ పెట్రోల్, డీజిల్ ధరలపైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అంతర్జాతీయంగా చమురు ధరల్లో తీవ్ర ఒడుదొడుకులు నెలకొన్నాయి. బుధవారం.. బ్యారెల్‌పై 88 డాలర్లుగా ఉన్న ముడి చమురు ధర.. గురువానికి 90డాలర్లకు చేరింది. ఇక శుక్రవారం.. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 92డాలర్లకు చేరింది.
Petrol diesel price today : అయితే.. పెట్రోల్ డీజిల్ ధరలను స్థిరీకరించేందుకు కేంద్రం కొన్ని నెలల క్రితం కృషి చేసింది. ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్ 7 నుంచి ఆయా ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ ఆధారిత ఓఎంసీ(ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు)లు.. డీజిల్‌పై లీటరుకు రూ. 5-6 నష్టపోతున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో.. లీటరు పెట్రోల్‌పై రూ. 2-3 మార్జిన్లు సంపాదిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద.. ఆయా కంపెనీలను మొత్తం కలుపుకుంటే.. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రూ. 18,480.27కోట్ల నష్టం వాటిల్లింది.
"ఈ నెల 14 వరకు ముడి చమురు ధరలు స్థిరంగా ఉంటే.. విండ్‌ఫాల్ ట్యాక్స్‌ని తగ్గించే అవకాశం ఉంది. కానీ పూర్తిగా తొలగించకపోవచ్చు," అని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.
అంతర్జాతీయంగా ముడి చమురు భారీగా పెరగడం, తగ్గడంతో.. విండ్‌ఫాల్ ట్యాక్స్‌ని జులై 1న విధించింది కేంద్రం. ఏదైనా కారణాలతో చమురు రిఫైనరీ సంస్థలకు అనూహ్య లాభాలు పొందుతున్నట్టు అయితే.. వాటిపై విండ్‌ఫాల్ ట్యాక్స్ విధిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 96.72గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ. 89.62గా ఉంది. ఈ ధరల్లో మార్పులు చేటుచోసుకోకపోవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
సంబంధిత కథనం