పరోటాతో గ్రేవీ ఫ్రీగా ఇస్తారా? ఇవ్వరా? వినియోగదారుల కోర్టు కీలక ఆదేశాలు-restaurant has no legal obligation to serve gravy with parotta and beef fry kerala consumer court ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పరోటాతో గ్రేవీ ఫ్రీగా ఇస్తారా? ఇవ్వరా? వినియోగదారుల కోర్టు కీలక ఆదేశాలు

పరోటాతో గ్రేవీ ఫ్రీగా ఇస్తారా? ఇవ్వరా? వినియోగదారుల కోర్టు కీలక ఆదేశాలు

Anand Sai HT Telugu

కేరళ కొచ్చిలోని ఒక రెస్టారెంట్‌లో పరోటాతో ఉచితంగా గ్రేవీ ఇవ్వడం గురించి వివాదం చెలరేగింది. దీనిపై వినియోగదారుల కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం

ొన్ని హోటళ్ళు, రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్ పరోటా, రోటీ వంటి వంటకాలతో ఉచిత గ్రేవీని అందిస్తాయి. కొన్ని రెస్టారెంట్లలో మీరు పరోటా, రోటీలతో పాటు గ్రేవీని విడిగా కొనుగోలు చేయాలి. కచ్చితంగా వాటికి డబ్బులు చెల్లించి తీసుకోవాలి. ఇది ఆయా హోటళ్ల రూల్. కానీ ఇప్పుడు ఈ విషయంపై వినియోగదారుల కోర్టులో కీలక తీర్పు వచ్చింది.

ఫ్రీ గ్రేవీపే ముఖ్యమైన ఉత్తర్వు

రెస్టారెంట్లు తమ వద్దకు వచ్చే కస్టమర్లకు పరోటాతో ఉచిత గ్రేవీని అందించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ వినియోగదారుల వ్యవహారాల కోర్టు ఒక ముఖ్యమైన ఉత్తర్వును జారీ చేసింది. కొచ్చిలోని పర్షియన్ టేబుల్ అనే రెస్టారెంట్ యజమాని గత ఏడాది నవంబర్ నుండి ఉచిత గ్రేవీకి సంబంధించి వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు. పరోటా - గ్రేవీ కేరళలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. అందుకే ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

రెస్టారెంట్ యజమాని వాదన

కోర్టు ముందు తన రెస్టారెంట్‌లో జరిగిన సంఘటనను వివరించారు పర్షియన్ టేబుల్ రెస్టారెంట్ యజమాని. 'ఒక కస్టమర్ రెస్టారెంట్‌కు వచ్చి పరోటా, బీఫ్ ఫ్రై ఆర్డర్ చేసాడు. కానీ, నేను గ్రేవీ ఇవ్వలేదు. మేం సాధారణంగా కస్టమర్లకు ఉచితంగా గ్రేవీ ఇవ్వం. ఒకవేళ బీఫ్ మాంసంతో గ్రేవీ ఉన్నప్పుడు.. గ్రేవీ ఉచితంగా వడ్డిస్తామని మర్యాదగా తెలియజేసాం. కోపంతో ఉన్న కస్టమర్ అరుస్తూ, అరుస్తూ రెస్టారెంట్ నుండి బయటకు వెళ్లాడు. నేరుగా స్థానిక ఫుడ్ సేఫ్టీ అదికారులకు, వినియోగదారుల కోర్టులో ఫిర్యాదులు చేశారు.' అని యజమాని వివరించారు.

అయితే ఈ కేసు విచారణ సమయంలో వివరణతో పాటు, రెస్టారెంట్ యజమాని ప్రతి నెలా ఉద్యోగుల జీతాలు, అద్దె, ఇతర ఖర్చుల వివరాలను కోర్టుకు సమర్పించాడు. ఉచిత గ్రేవీని అందించనందుకు గతంలో తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను వినియోగదారుల వ్యవహారాల కోర్టుకు వివరించాడు.

ఉచితంగా గ్రేవీ ఇవ్వొద్దు

వాదనలు విన్న వినియోగదారుల కోర్టు ఈ కేసులో ముఖ్యమైన తీర్పును వెలువరించింది. ఇక నుంచి ఏ కస్టమర్ కూడా హోటళ్లు, రెస్టారెంట్లలో ఉచిత గ్రేవీ తమ హక్కు అని వాదించకూడదని కోర్టు ఆదేశించింది. హోటళ్లకు వచ్చే కస్టమర్లకు ఉచితంగా గ్రేవీ ఇవ్వాలని వాదించలేమని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు హోటల్ పరిశ్రమకు స్పష్టమైన సందేశాన్ని పంపినట్టవుతుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.