Republic day Quiz : గణతంత్ర దినోత్సవం గురించి మీకు ఎంత తెలుసు? ఈ క్విజ్ చెబుతుంది..
Republic day quiz : గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? ఎప్పటి నుంచి రిపబ్లిక్ డేని భారత దేశంలో జరుపుకుంటున్నాము? ఈ ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలుసా? అయితే ఈ క్విజ్ మీకోసమే!
రిపబ్లిక్ డే 2025కి దేశం ఎదురుచూస్తోంది! జనవరి 26, ఆదివారం నాడు దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర దినోత్స వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. సాధారణంగా స్కూల్స్, కాలేజీల్లో ఈ సమయంలో డిబేట్స్, క్విజ్ పోటీలు నిర్వహిస్తుంటారు. మరి మీరెందుకు ఈ తరహా క్విజ్‌లో పాల్గొనకూడదు? రిపబ్లిక్ డే, దేశ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను క్విజ్ రూపంలో ఇక్కడ తెలుసుకోండి.

ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చూద్దాం..
1. రిపబ్లిక్ డే ని ఎందుకు జరుపుకుంటారు?
ఏ. స్వాతంత్ర్యం వచ్చినందుకు
బీ. రాజ్యాంగాన్ని ఆమోదించినందుకు
సీ. రాజ్యాంగం అమల్లోకి వచ్చినందుకు
డీ. ఇవేవీ కావు
2. భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు?
ఏ. 1947
బీ. 1950
సీ. 1949
డీ. 1952
3. రిపబ్లిక్ డే 2025 థీమ్ ఏంటి?
ఏ. పార్టిసిపేటివ్ గవర్నెన్స్
బీ. స్వార్నిమ్ భారత్- విరసిత్ వికాస్
సీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ
డీ. సుస్థిరాభివృద్ధి- సమానత్వం
4. భారత దేశ రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి?
ఏ. 6
బీ. 8
సీ. 4
డీ. 12
5. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో జెండా ఎవరు ఎగరేస్తారు?
ఏ. రాష్ట్రపతి
బీ. ప్రధాని
సీ. ఉపరాష్ట్రపతి
డీ. సీజేఐ
6. భారత దేశ జాతీయ చిహ్నం ఏది?
ఏ. అశోకుని సింహ రాజధాని
బీ. అరటి చెట్టు
సీ. నెమలి
డీ. కమలం
7. రాజ్యంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
ఏ. జవరి 26, 1949
బీ. జనవరి26, 1950
సీ. జనవరి 26, 1947
డీ. జనవరి 26, 1951
8. భారత దేశ మొదటి రాష్ట్రపతి ఎవరు?
ఏ. జవహర్లాల్ నెహ్రూ
బీ. బీఆర్ అంబేడ్కర్
సీ. గాంధీ.
డీ. డా. రాజేంద్ర ప్రసాద్.
9. రిపబ్లిక్ డే పరేడ్ చివరిలో ఏ పాట పాడతారు?
ఏ. సారే జహాన్‌సే అచ్చా
బీ. జనగణమన
సీ. అబైడ్ విత్ మీ
డీ. ఏమెరే వతన్ కే లోగోన్
10. గణతంత్ర దినోత్సం నేపథ్యంలో 9 రోజుల పండుగ జరుగుతుంది. ఏంటది?
ఏ. భారత్ ఫెస్టివల్
బీ. భారత్ పర్వ్
సీ. దేశ్ రంగ్
డీ. దేశ్ పర్వ్
పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానాలను ఇక్కడ తెలుసుకోండి..
1. సీ
2. సీ
3. బీ
4. డీ
5. ఏ
6. ఏ
7. బీ
8. డీ
9. సీ
10. బీ
మరి మీరెన్ని సమాధానాలు కరెక్ట్‌గా చెప్పారు?
సంబంధిత కథనం