Republic Day 2023: కర్తవ్యపథ్‍లో రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభం: జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి-republic day celebrations begins across india first parade on kartavya path ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Republic Day Celebrations Begins Across India First Parade On Kartavya Path

Republic Day 2023: కర్తవ్యపథ్‍లో రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభం: జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 26, 2023 10:52 AM IST

Republic Day 2023 Celebrations: గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‍పై రిపబ్లిక్ డే పరేడ్ మొదలైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండా ఆవిష్కరించారు.

త్రివిధ దశాల గౌరవ వందనం స్వీకరిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
త్రివిధ దశాల గౌరవ వందనం స్వీకరిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (ANI Photo)

Republic Day 2023: దేశవ్యాప్తంగా నేడు (జనవరి 26) 74వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుగుతోంది. దేశరాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‍ (Kartavya Path)లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు. ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా అల్ సిసి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రిపబ్లిక్ డే పరేడ్‍ (Republic Day Parade) ఘనంగా ప్రారంభమైంది. ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

Republic Day 2023: కర్తవ్యపథ్‍పై రిపబ్లిడే పరేడ్ జరగడం ఇదే తొలిసారి. బ్రిటీష్ కాలం నుంచి రాజ్‍పథ్‍గా ఉన్న దీని పేరును గతేడాది కర్తవ్యపథ్‍గా మార్చింది కేంద్ర ప్రభుత్వం. కర్తవ్యపథ్‍గా నామకరణం చేశాక ఇక్కడ జరుగుతున్న గణతంత్ర వేడుకలు ఇవే. పరేడ్‍లో భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాలు అబ్బురపరిచే విన్యాసాలు చేస్తాయి. కవాతులు నిర్వహిస్తాయి.

పటిష్ట భద్రత

Republic Day 2023: కర్తవ్యపథ్‍లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‍కు 65వేల మంది ప్రత్యక్షంగా హాజరువుతున్నారు. గణతంత్ర వేడుకల కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. 6000 మంది సైనికులు రిపబ్లిక్ డే సెక్యూరిటీ విధుల్లో ఉన్నారు. 150 సీసీ టీవీ కెమెరాతో నిఘా పెట్టారు.

శకటాలు

17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి శకటాల ప్రదర్శన పరేడ్‍లో ఉంటుంది. వివిధ మంత్రిత్వశాఖలు, డిపార్ట్ మెంట్ల నుంచి మరో మరిన్ని ప్రదర్శనకు వస్తాయి. సాంస్కృతిక వారసత్వం, ఆర్థికాభివృద్ధి, సామాజిక పురోగతి, మహిళా శక్తి, నవభారతాన్ని కళ్లకు కట్టేలా ఈ శకటాలు ఉండనున్నాయి.

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 479 కళాకారులు.. సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తారు. ధైర్య సాహసాలు ప్రదర్శించిన, వివిధ రంగాల్లో రాణించిన 11 మంది చిన్నారులు.. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాన్ని అందుకోనున్నారు.

పరేడ్‍లో సిగ్నల్ కాప్స్ ‘డేర్ డెవిల్స్ టీమ్‍’ మోటార్ సైకిళ్లతో విన్యాసాలు చేస్తుంది.

భారత వాయుసేన నిర్వహించే వైమానిక విన్యాసాలు.. రిపబ్లిక్ డే వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి. ఈసారి కూడా రఫేల్ యుద్ధ విమానం విన్యాసాల్లో ఉండనుంది.

సెంట్రల్ విస్టా, కర్తవ్యపథ్, కొత్త పార్లమెంట్ భవనాల నిర్మాణంలో భాగమైన వారికి, కొందరు పాలు, కూరగాయల వ్యాపారులకు ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‍కు ఆహ్వానం పంపింది ప్రభుత్వం.

దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో ఉండనుంది. దేశీయంగా తయారు చేసిన 3,500 డోన్లు ఈ ప్రదర్శనలో ఆకాశంలో ఎగరనున్నాయి.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23వ తేదీన మొదలయ్యే గణతంత్ర వేడుకలు.. జనవరి 29న బీటింగ్ రిట్రీత్‍తో ముగుస్తాయి.

WhatsApp channel