Republic Day 2025 Live : ఊరూ, వాడా ‘గణతంత్ర’ వేడుకలు- కర్తవ్య పథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్..
- Republic Day 2025 Live : 76వ రిపబ్లిక్ డేని భారత దేశం ఘనంగా జరుపుకుంటోంది. మారుమూల గ్రామాల నుంచి దేశ రాజధాని దిల్లీ వరకు ఈరోజు జరుగుతున్న ఈవెంట్స్‌కి సంబంధించిన లైవ్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
Sun, 26 Jan 202507:32 AM IST
ముగిసిన పరేడ్
దిల్లీ కర్తవ్య పథ్‌లో ఏర్పాటు చేసిన రిపబ్లిక్ డే పరేడ్ ముగిసింది. అనంతరం అక్కడికి వెళ్లిన ప్రజలను మోదీ పలకించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Sun, 26 Jan 202506:30 AM IST
స్వర్ణిమ్ భారత్- విరాసత్ ఔర్ వికసిత్
76వ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో దిల్లీ కర్తవ్య పథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అనంతరం సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకలను వీక్షించేందుకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో, భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ సహా అనేక మంది కేంద్రమంత్రులు, నేతలు కర్తవ్య పథ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఏడాది.. "స్వర్ణిమ్ భారత్- విరాసత్ ఔర్ వికసిత్' అనే థీమ్‌తో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుని మొత్తం మీద ఈసారి 31 శకటాలను ప్రదర్శనకు వచ్చాయి. అంతేకాదు, త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి పరేడ్‌లో ప్రత్యేకమని చెబుతున్నారు. వీటితో పాటు బ్రహ్మోస్- ఆకాశ్ మిసైళ్లు, ఇతర రాకెట్ల ప్రదర్శన సైనిక శక్తిని ప్రతిబింబించాయి.
Sun, 26 Jan 202506:07 AM IST
వివిధ రాష్ట్రాల శకటాలు..
రిపబ్లిక్ డే పరేడ్‌లో వివిధ రాష్ట్రాల ట్యాబ్లోలు ప్రదర్శనకు వచ్చాయి. వివిధ రాష్ట్రాల సంస్కృతికి అవి చిహ్నంగా నిలిచాయి.
Sun, 26 Jan 202505:40 AM IST
మిలిటరీ పరెడ్..
దిల్లీ కర్తవ్య పథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ కొనసాగుతోంది. మిలిటరీ కవాతు సాగుతోంది.
Sun, 26 Jan 202505:08 AM IST
కర్తవ్య పథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్..
కర్తవ్య పథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన అతిథి ఇండోనేషియ్ అధ్యక్షుడు, ప్రధాని మోదీతో పాటు ఇతర ముఖ్యమైన నేతలు ఇందులో పాల్గొన్నారు.
Sun, 26 Jan 202505:00 AM IST
కర్తవ్య పథ్కి ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రెసిడెన్షియల్ క్యారేజ్‌లో రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్య పథ్కి బయలుదేరారు. రిపబ్లిక్ డేకి ప్రత్యేక అతథిగా వచ్చిన ఇండోనేషియల్ అధ్యక్షుడు సుబియాంటో సైతం ఆమె వెంటే ఉన్నారు.
Sun, 26 Jan 202504:51 AM IST
యుద్ధ స్మారకం వద్ద మోదీ..
దిల్లీ యుద్ధ స్మారకంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అక్కడి నుంచి కర్తవ్య పథ్‌కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంటారు.
Sun, 26 Jan 202504:32 AM IST
రాహుల్ గాంధీ ట్వీట్..
దేశ ప్రజలందరికీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “మన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలపై ఆధారపడిన మన రాజ్యాంగం భారత గణతంత్రానికి గర్వకారణం. ఇది మతం, కులం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడికి రక్షణ కవచం - దానిని గౌరవించడం, రక్షించడం మనందరి కర్తవ్యం. జై హింద్, జై ఇండియా, జై కాన్స్టిట్యూషన్,” అని అన్నారు.
Sun, 26 Jan 202504:17 AM IST
ఈ విషయం మీకు తెలుసా?
పబ్లిక్ డే పరేడ్కి ఒక సంవత్సరం ముందు జులైలో సన్నాహాలు ప్రారంభమవుతాయి. పాల్గొనేవారు తమ భాగస్వామ్యాన్ని అధికారికంగా తెలియజేస్తారు. పరేడ్ రోజున, వారు తెల్లవారుజామున 3 గంటలకు వేదిక వద్దకు చేరుకుంటారు. అప్పటికి వారు సుమారు 600 గంటల పాటు ప్రాక్టీస్ చేసి ఉంటారు!
Sun, 26 Jan 202503:33 AM IST
రిపబ్లిక్ డే పరేడ్ లైవ్..
ప్రసార భారతి లైవ్, డిస్నీ+ హాట్ స్టార్, ఇతర ప్రైవేట్ న్యూస్ ఛానళ్లు కూడా తమ వెబ్ సైట్లు, యాప్‌లలో ఈ రిపబ్లిక్ డే పరేడ్‌ని ప్రసారం చేయనున్నాయి.
Sun, 26 Jan 202503:14 AM IST
ప్రధాని మోదీ ట్వీట్..
'ఈ రోజు మనం రిపబ్లిక్‌గా అవతరించి 75 ఏళ్లు పూర్తయ్యాయి. మన రాజ్యాంగాన్ని రూపొందించి, మన ప్రయాణం ప్రజాస్వామ్యం, గౌరవం, ఐక్యతలో పాతుకుపోయేలా చేసిన గొప్ప మహిళలు, పురుషులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను,' అని మోదీ తన ట్వీట్ పేర్కొన్నారు.
Sun, 26 Jan 202502:53 AM IST
మోదీపై ప్రశంసలు..
గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథి, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. పేదరిక నిర్మూలన, అణగారిన వర్గాలకు సాయం చేయడంలో ప్రధాని మోదీ నిబద్ధత స్ఫూర్తిదాయకమని సుబియాంటో కొనియాడారు.
Sun, 26 Jan 202502:26 AM IST
దేశవ్యాప్తంగా..
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. వివిధ రాజకీయ కార్యాలయాల్లో నేతలు జెండా వందనాలు చేస్తున్నారు.
Sun, 26 Jan 202502:07 AM IST
దిల్లీలో ఏర్పాట్లు ఇలా..
జనవరి 26 న కర్తవ్య పథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం దిల్లీ జిల్లాలో 70 కంపెనీలకు పైగా పారామిలటరీ దళాలు, 15,000 మందికి పైగా పోలీసు సిబ్బంది, వేలాది సిసిటివిలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాలను మోహరించారు.
బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లలో భాగంగా డ్రోన్లు, సీసీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ ఏర్పాటు చేసిన కార్లు, నేరస్థులను గుర్తించేందుకు డేటాబేస్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాలతో నగరాన్ని పర్యవేక్షించనున్నారు.
Sun, 26 Jan 202501:40 AM IST
జనవరి 26నే రిపబ్లిక్ డేని ఎందుకు జరుపుకుంటారు?
1949 నవంబర్ 26 రాజ్యాంగాన్ని ఆమోదించారే కానీ దానిని అమలు చేయలేదు. ఎప్పుడు అమలు చేద్దాము? అని ఆలోచిస్తుండగా.. అప్పటి రాజకీయ పెద్దలకు 'జనవరి 26' సరైన తేదీ అనిపించింది. ఇందుకు ఓ ముఖ్య కారణం ఉంది.
బ్రిటీష్ పాలనపై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోరాడుతున్న సమయం అది. 1930 జనవరి 26న.. తొలిసారిగా పూర్ణ స్వరాజ్ (సంపూర్ణ స్వాతంత్ర్యం) నినాదాన్ని ఇచ్చింది కాంగ్రెస్. దేశ స్వాతంత్ర్య పోరాటంలో అదొక కీలక ఘట్టంగా భావిస్తారు.
అందుకే.. 20ఏళ్ల తర్వాత అదే రోజున, అంటే జనవరి 26, 1950న రాజ్యాంగాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
Sun, 26 Jan 202501:22 AM IST
రిపబ్లిక్ డే పరేడ్ 2025..
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 16, కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల నుంచి 15 టాబ్లోస్ ఈ పరేడ్‌లో పాల్గొంటాయి.
బ్రహ్మోస్, పినాకా, ఆకాశ్ సహా కొన్ని అత్యాధునిక రక్షణ ఉత్పత్తులను భారతదేశం ప్రదర్శిస్తుంది.
Sun, 26 Jan 202501:14 AM IST
దిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు..
రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని దిల్లీ భద్రతా వలయంలోకి జారుకుంది. పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు వేసి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కర్తవ్య పథ్ వద్ద గ్రాండ్ పరేడ్ సజావుగా నిర్వహించడానికి అమలులో ఉన్న ఆంక్షల గురించి పోలీసులు అడ్వైజరీలను జారీ చేశారు.
Sun, 26 Jan 202512:52 AM IST
రిపబ్లిక్ డే థీమ్..
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్' (గోల్డెన్ ఇండియా: హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్) అనే థీమ్‌తో ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించినున్నారు.
Sun, 26 Jan 202512:52 AM IST
ముఖ్య అతిథిగా..
ఈసారి రిపబ్లిక్ డే 2025 వేడుకలకు రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈయన ఇప్పటికే ఇండియాకు చేరుకుని, ప్రధాని మోదీతో చర్చలు జరిపారు.
Sun, 26 Jan 202512:51 AM IST
జెండా వందనం..
ఉదయం 9 గంటలకు రాష్ట్రపతి పతాకావిష్కరణ కార్యక్రమంతో రిపబ్లిక్ డే వేడుకలు ప్రారంభమవుతాయి. ఆన్లైన్ వీక్షకులు ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ నేషనల్ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. హెచ్‌టీ తెలుగు లైవ్ అప్డేట్స్, యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అవ్వొచ్చు.
Sun, 26 Jan 202512:49 AM IST
నేడు 76వ గణతంత్ర దినోత్సవం..
భారత దేశం నేడు 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఇందుకోసం దేశ రాజధాని దిల్లీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దిల్లీలో జరిగే ప్రధాన పరేడ్ ఆదివారం ఉదయం 10:30 గంటలకు విజయ్ చౌక్ వద్ద ప్రారంభమై, కర్తవ్య మార్గం గుండా ప్రయాణించి, ఇండియా గేట్ దాటి ఎర్రకోట వద్ద ముగుస్తుంది.