Telugu News  /  National International  /  Reliance Said To Be Sole Bidder For Metro's India Business
మెట్రో స్టోర్
మెట్రో స్టోర్ (Photo: Bloomberg)

Reliance bids For Metro’s India business: రిలయన్స్ చేతికి ‘మెట్రో’ ఇండియా!

13 October 2022, 22:37 ISTHT Telugu Desk
13 October 2022, 22:37 IST

Reliance bids For Metro’s India business: ‘మెట్రో ఇండియా’ బిజినెస్ ను కొనుగోలు చేసే దిశగా రిలయన్స్ అడుగులు వేస్తోంది. మెట్రో ఇండియా కొనుగోలుకు సంబంధించిన రేసులో ప్రస్తుతం రిలయన్స్ మాత్రమే మిగిలినట్లు సమాచారం.

Reliance bids For Metro’s India business: ‘మెట్రో’ స్టోర్ లు భారత్ లోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఉన్నాయి. చవకైన ధరలకు అన్ని రకాల వస్తువులను తమ బిజినెస్ కస్లమర్లకు మాత్రమే అందించే స్టోర్లుగా వాటికి పేరుంది.

ట్రెండింగ్ వార్తలు

Reliance bids For Metro’s India business: తుది దశలో చర్చలు

అయితే, రిటైల్ రంగంలో ప్రధాన పోటీదారుగా ఉన్న రిలయన్స్ సంస్థ ‘మెట్రో ఇండియా’ బిజినెస్ ను హస్తగతం చేసుకునే దిశగా ఆలోచిస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నట్లు సమాచారం. మెట్రో స్టోర్లు జర్మనీ కి చెందిన ఏజీ గ్రూప్ నకు చెందినవి.

Reliance bids For Metro’s India business: 1.2 బిలియన్ డాలర్ల డీల్

మెట్రో ఇండియా కొనుగోలు డీల్, ఆ సంస్థకు ఉన్న అప్పులతో పాటు, 100 కోట్ల డాలర్ల నుంచి 120 కోట్ల డాలర్ల మధ్య ఉండవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. మెట్రో కొనుగోలులో రిలయన్స్ కు పోటీగా ఉన్న చారియన్ పోక్ఫండ్ గ్రూప్ ఈ రేసు నుంచి వైదొలగడంతో, ప్రస్తుతం మెట్రో ఇండియాను కొనుగోలు చేసే రేసులో రిలయన్స్ మాత్రమే మిగిలింది. అయితే, ఈ డీల్ పై స్పందించడానికి రిలయన్స్, మెట్రో ప్రతినిధులు నిరాకరించారు.

Reliance bids For Metro’s India business: 2003 నుంచి

మెట్రో భారత్ లోకి 2003లో ప్రవేశించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 31 స్టోర్లను నిర్వహిస్తోంది. వీటి క్లయింట్లలో ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, కార్పొరేట్లు, చిన్న తరహా రిటైలర్లు ఉన్నారు.