Jio new prepaid plan : జియో కొత్త ప్లాన్​ వచ్చేంది.. రోజుకు 2జీబీ డేటా!-reliance jio new prepaid plan offers 2gb data per day check details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Reliance Jio New Prepaid Plan Offers 2gb Data Per Day: Check Details

Jio new prepaid plan : జియో కొత్త ప్లాన్​ వచ్చేంది.. రోజుకు 2జీబీ డేటా!

Sharath Chitturi HT Telugu
Aug 15, 2022 02:41 PM IST

Reliance Jio new prepaid plan : కొత్త ప్రీపెయిడ్​ ప్లాన్​ను ప్రకటించింది జియో. రోజుకు 2జీబీ డేటా లభిస్తోంది.

కొత్త ప్రీపెయిడ్​ ప్లాన్​ తీసుకొచ్చిన రిలయన్స్​ జియో
కొత్త ప్రీపెయిడ్​ ప్లాన్​ తీసుకొచ్చిన రిలయన్స్​ జియో (Mint)

Reliance Jio new prepaid plan : వినియోగదారులను ఆకట్టుకునేందుకు రిలయన్స్​ జియో ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్​లతో ముందుకొస్తుంది. తాజాగా.. జియో కొత్త ప్రీపెయిడ్​ ప్లాన్​ను ప్రకటించింది. ఇకపై రూ. 750కే రోజుకు 2జీబీ మొబైల్​ డేటాను పొందవచ్చు! స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కొత్త ప్రీపెయిడ్​ ప్లాన్​ను విడుదల చేసింది జియో.

ట్రెండింగ్ వార్తలు

ఈ జియో కొత్త ప్రీపెయిడ్​ ప్లాన్​ వాలిడిటీ 90రోజులు. ఈ ప్రీపెయిడ్​ ప్లాన్​ ఇప్పటికే మై జియో యాప్​లో లిస్ట్​ అయ్యింది.

జియో కొత్త ప్రీపెయిడ్​ ప్లాన్​..

గతంలో ఉన్న రూ. 749, ఆర్​ఈ 1 ప్లాన్​ల కలియికే ఈ కొత్త రూ. 750 ప్లాన్​. రూ. 749 ప్లాన్​లో అన్​లిమిటెడ్​ వాయిస్​ కాలింగ్​ డేటా, మొబైల్​ డేటా (రోజుకు 2జీబీ). డైలీ లిమిట్​ దాటిన తర్వాత ఇంటర్నెట్​ స్పీడ్​ 64కేబీపీఎస్​కి పడిపోతుంది. ఈ ప్లాన్​తో రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు లభిస్తోంది.

ఆర్​ఈ 1 ప్లాన్​ ఆఫర్​లో 100ఎంబీ హై స్పీడ్​ డేటా(90రోజుల వాలిడిటీ). జియో యాప్​లు, సావన్​, జియోసినిమా ఇతర యాప్​లు తదితర బెనిఫిట్​లు ఉంటాయి.

ఇతర రిలయన్స్ జియో ప్లాన్​..

Jio new prepaid plan : రూ. 249, రూ. 299, రూ. 533, రూ. 719, రూ. 799, రూ. 1066, రూ. 2879 ప్లాన్​లతో పాటు ఈ రూ. 750 కొత్తగా జియో రిలయన్స్​ ప్లాన్​ చేరింది. ఇవన్నీ రోజుకు 2జీబీ డేటా అందిస్తున్నాయి.

ఉదాహరణకు రూ. 249 ప్లాన్​.. 23రోజుల వాలిడిటీ లభిస్తోంది. రూ. 299 ప్రీపెయిడ్​ ప్లాన్​. 28రోజుల వాలిడిటీ ఇస్తోంది. రూ. 533 జియో రిలయన్స్​ ప్లాన్​ 56రోజుల వాలిడిటీ వస్తోంది. రూ. 719 ప్రీపెయిడ్​ ప్లాన్​.. 84రోజుల పాటు లభిస్తోంది.

రూ. 799, రూ. 1066 జియో ప్రీపెయిడ్​ ప్లాన్​తో డిస్నీ ప్లస్​​ హాట్​స్టర్​ ఫ్రీ సబ్​స్క్రిప్షన్​ వస్తోంది. రూ. 799 ప్లాన్​ 56రోజుల వాలిడిటీతో వస్తోంది. రూ. 1066 ప్లాన్​పై.. 84రోజుల పాటు వాలిడిటీ ఇస్తోంది జియో. రిలయన్స్​ జియో రూ. 2,879 ప్లాన్​.. 365రోజుల వాలిడిటీతో లభిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్