Jio 6th anniversary : విప్లవాత్మక మార్పులు.. మెరుగైన జీవనం- ‘జియో’కు సలాం!-reliance jio 6th anniversary from 4g to true 5g everything you need to know ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Reliance Jio 6th Anniversary, From 4g To True 5g, Everything You Need To Know

Jio 6th anniversary : విప్లవాత్మక మార్పులు.. మెరుగైన జీవనం- ‘జియో’కు సలాం!

Sharath Chitturi HT Telugu
Sep 04, 2022 06:33 PM IST

Jio 6th anniversary : సోమవారం 6వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది రిలయన్స్​ జియో. దేశంలోకి జియో రాకతో అంతా మారిపోయింది. ఈ నేపథ్యంలో జియోపై ప్రత్యేక కథనం మీకోసం..

రిలయన్స్​ జియో
రిలయన్స్​ జియో (Bloomberg)

Reliance Jio 6th anniversary : 2022 సెప్టెంబర్​ 5న.. 6వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది రిలయన్స్​ జియో. ఈ ఆరేళ్ల ప్రయాణంలో రిలయన్స్​ జియో.. దేశ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఆరేళ్లల్లో.. యావరేజ్​ పర్​క్యాపిటా డేటా కన్సమ్షన్​ను టెలికాం పరిశ్రమ 100రెట్లు పెంచుకోగలిగింది. ట్రాయ్​ ప్రకారం.. జియో లాంచ్​కి ముందు.. ప్రతి భారతీయుడు నెలకు 154ఎంబీ డేటాను మాత్రమే వినియోగించేవాడు. జియో లాంచ్​ తర్వత.. ప్రతి యూజర్​ నెలకు 15.8జీబీని వాడుకుంటున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

ఈ ఏడాది దీపావళి నాటికి.. జియో యూజర్లకు 5జీ అందిస్తామని రిలయన్స్​ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ ప్రకటించారు. ఇక 5జీ లాంచ్​ తర్వాత.. డేటా కన్సమ్షన్​లో భారీ మార్పులు చోటుచేసుకోవచ్చు! 5జీ లాంచ్​తో.. రానున్న మూడేళ్లల్లో డేటా వినియోగం 2రెట్లు పెరుగుతుందని ఎరిక్సన్​ మొబిలిటీ నివేదికలో బయటపడింది. 5జీ రాకతో.. ఇతర పరిశ్రములు కూడా వృద్ధిచెందుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా 5జీ డేటాకు డిమాండ్​ విపరీతంగా పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

Reliance Jio 5G : 4జీ టెక్నాలజీ, వేగం విషయంలో జియో రికార్డు అద్భుతంగా ఉంది. ఇక ఇప్పుడు 5జీపై జియో కన్నేసింది. వివిధ టెక్నాలజీలకు తగ్గట్టుగా 5జీని తీసుకొస్తోంది.

ఆరేళ్ల క్రితం.. ముకేశ్​ అంబానీ జియోని లాంచ్​ చేసినప్పుడు.. ఇంతటి విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని ఎవరూ ఊహించి ఉండరు! దేశంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం సంస్థల్లో ఒకటిగా జియో నిలుస్తుందని ఎవరూ కూడా అనుకుని ఉండరు. ఈరోజున.. భారత టెలికాం మార్కెట్​లో జియో వాటా 36శాతం. 413 మిలియన్​ మంది జియోను, మరో 7మిలియన్​ మంది జియోఫైబర్​ను వినియోగిస్తున్నారు. ఇక జీయో 5జీతో ఈ నెంబర్లు భారీగా పెరిగే అవకాశం లేకపోలేదు.

జియోతో 'లైఫ్​ జింగాలాలా..'

1. Reliance Jio plans : ఫ్రీ కాలింగ్​:- జియోకి ముందు వాయిస్​ కాలింగ్స్​ కోసం వినియోగదారుడు విపరీతంగా ఖర్చు చేయాల్సి వచ్చేది. ఎంట్రీ ఇస్తూనే.. వాయిస్​ కాల్స్​ను ఫ్రీ చేసేసింది జియో. ఇది అప్పటి ప్రజలకు నూతన అనుభూతి. ఫలితంగా మొబైల్​ బిల్స్​పై ఖర్చు తగ్గింది. జియో సక్సెస్​తో ఇతర టెలికాం సంస్థలపై ఒత్తిడి పడింది. ఫలితంగా ఆయా కంపెనీలు కూడా ఫ్రీ ఔట్​గోయింగ్​ స్ట్రాటజీలు అప్లై చేయాల్సి వచ్చింది.

2. అత్యంత చౌకైన డేటా:- జియోకి ముందు.. డేటా ఛార్జీలు భారీగా ఉండేవి. జియో రాకతో.. అవి అంతే భారీగా దిగొచ్చాయి! జియో లాంచ్​కి ముందు.. 1 జీబీ డేటా కోసం కస్టమర్లు రూ. 250 ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇక జియో ఎంట్రీతో.. అది రూ. 100, రూ. 50లోపే ఉంటోంది. అంటే.. 6ఏళ్లల్లో డేటా ధరలు 95శాతం పడిపోయినట్టు అర్థం.

3. Jio 6th anniversary offers : డిజిటల్​ ఎకానమీ- ఈకామర్స్​:- ఇండియా డిజిటల్​ ఎకానమీకి రిలయన్స్​ జియో వెన్నెముకగా ఉంది! చౌకైన డేటాతో పాటు ప్రభుత్వ చర్యలతో దేశంలో డిజిటల్​ ఎకానమీ వృద్ధి చెందింది. జియో లాంచ్​కి ముందు.. యూపీఐ ద్వారా కేవలం 32.64కోట్ల లావాదేవీలు మాత్రమే జరిగాయి. ఇక ఇప్పుడు.. 2022 ఆగస్టు నాటికి అది 10.72లక్షల కోట్లకు చేరింది. బ్రాడ్​బ్యాండ్​ సబ్​స్క్రైబర్లతో పాటు, ఇంటర్నెట్​ స్పీడ్​ 5రెట్లు పెరగడంతో డిజిటల్​ ఎకానమీ ఊపిరిపీల్చుకుంది.

4. యూనికార్న్​ కంపెనీలు:- ఈరోజున.. 105 యూనికార్న్​ కంపెనీలకు పుట్టినిల్లు భారత్​. వాటి వాల్యుయేషన్​ 338 బిలియన్​ డాలర్ల కన్నా ఎక్కువే! జియో లాంచ్​కి ముందు.. కేవలం 4 యూనికార్న్​ కంపెనీలే ఉండేవి. వాటి వాల్యూ 1 బిలియన్​ డాలర్లుగా ఉండేది. 2021లో.. 44 స్టార్ట్​అప్​ కంపెనీలు.. యూనికార్న్​ జాబితాలో చేరాయి. వీటిల్లో చాలా కంపెనీలు.. జియోకు ప్రత్యేకంగా థాంక్యూ చెప్పడం విశేషం.

5. JioPhone : జియోఫోన్​:- కొత్త, స్మార్ట్​ఫోన్​ను కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక.. దేశంలోని 500మిలియన్​ మంది ప్రజలు పాత ఫోన్లే వాడుతున్నారు. వాటిల్లో 2జీ మాత్రమే ఉండేది. ఈ సమస్యకు జియో చెక్​ పెట్టింది! 4జీ జియోఫోన్​ను సరసమైన ధరలో లాంచ్​ చేసి విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. ఇప్పటివరకు 11కోట్లకు పైగా జియోఫోన్​లు అమ్ముడుపోయాయి.

6. Jiofiber : జియోఫైబర్​:- లాక్​డౌన్​లో జియోఫైబర్​ సేవలు చాలా ఉపయోగకరంగా నిలిచాయి. లాక్​డౌన్​ సమయంలో ఇంటర్నెట్​ లేకపోవడం అన్న మాటను వింటేనే భయమేస్తుంది. వర్క్​ ఫ్రం హోం, ఆన్​లైన్​ క్లాసులు, సినిమాలు, వినోదాత్మక ప్రోగ్రామ్​లు.. ఇలా ఎన్నో.. లాక్​డౌన్​లో చేశాము. మనలో చాలా మందికి జియోఫైబర్​ సేవలు ఉపయోగపడ్డాయి. మూడేళ్ల కాలంలోనే 70లక్షలకుపైగా క్యాంపస్​లు జియోఫైబర్​తో కనెక్ట్​ అయ్యాయి. జియోఫైబర్​ వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పరోక్షంగా లభిస్తున్నాయి. ఇంటర్నెట్​తో ఏర్పడిన అనేక ఈకామర్స్​, హోం డెలివరీ సంస్థలు.. లక్షలాది మందిని నియమించుకున్నాయి.

ఇంతటి ప్రత్యేకతలో భారతీయులకు ఎంతగానో ఉపయోగపడిన ‘జియో’కు సలాం…!

WhatsApp channel

సంబంధిత కథనం