'ఫ్యూచర్'​కు కోలుకోలేని దెబ్బ.. రిలయన్స్​తో​ డీల్​ రద్దు..!-reliance future deal off as secured creditors reject the proposal ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Reliance Future Deal Off As Secured Creditors Reject The Proposal

'ఫ్యూచర్'​కు కోలుకోలేని దెబ్బ.. రిలయన్స్​తో​ డీల్​ రద్దు..!

HT Telugu Desk HT Telugu
Apr 24, 2022 06:14 AM IST

వివాదాస్పద ఫ్యూచర్​ రిలయన్స్​ ఒప్పందం రద్దు అయ్యింది! ఫ్యూచర్​కు చెందిన సెక్యూర్డ్​ క్రెడిటర్లు.. ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఓట్లు వేశారు. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్​ దివాలా ముంగిట నిలబడింది..!

రిలయన్స్​ ఫ్యూచర్​ ఒప్పందం రద్దు!
రిలయన్స్​ ఫ్యూచర్​ ఒప్పందం రద్దు!

Reliance Future deal off | అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్​ రిటైల్​ సంస్థకు పెద్ద షాక్​ తగిలింది. ఆ కంపెనీతో గతేడాది కుదుర్చుకున్న రూ. 24,713కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు రిలయన్స్​ ఫ్రకటించింది. ఫ్యూచర్​ గ్రూప్​లోని సెక్యూర్డ్​ క్రెడిటర్లు(బ్యాంకులు, ఆర్థిక సంస్థలు).. ఒప్పందానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని, అందుకే ఈ డీల్​తో ముందుకు వెళ్లలేమని రెగ్యులేటర్లకు రిలయన్స్​ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

"ఒప్పందానికి వ్యతిరేకంగా ఫ్యూచర్​ సంస్థ సెక్యూర్డ్​ క్రెడిటర్లు ఓట్లు వేశారు. దానిని దృష్టిలో పెట్టుకుని.. ఒప్పందంతో ముందుకు వెళ్లలేకపోతున్నాము," అని రిలయన్స్​ పేర్కొంది.

రిలయన్స్​లో తమ సంస్థను విలీనం చేసేందుకు, ఆస్తులను అమ్మేందుకు షేర్​హోల్డర్లు, సెక్యూర్డ్​ క్రెడిటర్ల నుంచి అనుమతి కోరడం కోసం ఈ వారం ఓటింగ్​ నిర్వహించింది ఫ్యూచర్​ రిటైల్​. అనుమతి రావాలంటే 75శాతం ఓట్లు రావాల్సి ఉంది. దానిని ఫ్యూచర్​ గ్రూప్​ సంపాదించుకోలేకపోయింది. షేర్​హోల్డర్లు ఒప్పుకున్నా, ఇతరులు మాత్రం ఒప్పందాన్ని వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఓటింగ్​ను ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్​ తీవ్రంగా వ్యతిరేకించినట్టు సమాచారం. అమెజాన్​కు.. ఫ్యూచర్​ సంస్థల్లో 49శాతం వాటా ఉండటం గమనార్హం.

దివాలా తప్పదా..?

Future retail Reliance | ఫ్యూచర్​ గ్రూప్​నకు అనేక కంపెనీలు ఉన్నాయి. కానీ అవన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. కొవిడ్​ కారణంగా వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. పోటీని తట్టుకోలేక ఫ్యూచర్​ గ్రూప్​ చతికిలపడింది. ఈ క్రమంలోనే సంస్థను అమ్మేందుకు ప్రమోటర్​ కిషోర్​ బియాని ఆలోచించారు. 2020 ఆగస్టు సమయంలో రిలయన్స్​తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

కానీ ఈ ఒప్పందానికి అమెజాన్​ అడ్డుపడుతూ వచ్చింది. తమ ఒప్పందానికి వ్యతిరేకంగా ఫ్యూచర్​ వ్యవహరిస్తోందంటూ కోర్టు మెట్లు ఎక్కింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ కోర్టుల్లో ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. ఓవైపు న్యాయపోరాటం సాగిస్తుండగానే.. ఫ్యూచర్​లోని కొన్ని రిటైల్​ వ్యాపారాలను రిలయన్స్​ నడపడం మొదలుపెట్టింది. దీనిని అమెజాన్​ తీవ్రంగా వ్యతిరేకించింది.

తాజా పరిణామాలతో ఫ్యూచర్​ సంస్థ మరింత అంధకారంలోకి కూరుకుపోయింది. అప్పులతో కొట్టుమిట్టాడుతున్న సంస్థను గట్టెక్కించేందుకు జరుగుతున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. మరోవైపు గత వారంలోనే.. ఫ్యూచర్​ దివాలా ప్రక్రియను మొదలుపెట్టాలని ఎన్​సీఎల్​టీలో అప్పీలు దాఖలైంది. ఫ్యూచర్​కు అప్పులు ఇచ్చిన బ్యాంక్​ ఆఫ్​ ఇండియా.. ఈ ప్రతిపాదన చేసింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్