Reliance Foundation scholarships: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్;అప్లై చేసుకోండి-reliance foundation announces major merit scholarships ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Reliance Foundation Announces Major Merit Scholarships

Reliance Foundation scholarships: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్;అప్లై చేసుకోండి

HT Telugu Desk HT Telugu
Dec 28, 2022 06:09 PM IST

Reliance Foundation scholarships: రిలయన్స్ ఫౌండర్ ధీరూభాయి అంబానీ 90వ జయంతి సందర్భంగా బుధవారం రిలయన్స్ ఫౌండేషన్ 2022- 23 సంవత్సరానికి స్కాలర్ షిప్ లను ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Reliance Foundation scholarships: ధీరూభాయి అంబానీ 90వ జయంతి సందర్భంగా బుధవారం రిలయన్స్ ఫౌండేషన్(Reliance Foundation) 2022- 23 సంవత్సరానికి ఉన్నత విద్యలో స్కాలర్ షిప్ లను ప్రకటించింది. ఏ రంగంలోని విద్యార్థులైనా కొన్ని షరతులకు లోబడి ఈ స్కాలర్ షిప్(scholarships) పొందడానికి అర్హులు. అర్హత, కోర్సును బట్టి అండర్ గ్రాడ్యుయేట్ లకు గరిష్టంగా రూ. 2 లక్షల వరకు, పీజీలకు రూ. 6 లక్షల వరకు ఈ గ్రాంట్ ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Reliance Foundation scholarships: వచ్చే పదేళ్లలో 50 వేల స్కాలర్ షిప్స్

2022-23 సంవత్సరానికి 5వేల అండర్ గ్రాడ్యుయేట్(), 100 పీజీ స్కాలర్ షిప్ లను రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) తరఫున అందించనున్నారు. వచ్చే పదేళ్లలో మొత్తంగా సుమారు 50 వేల కు పైగా స్కాలర్ షిప్(scholarships) లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మెరిట్ బేస్డ్ పీజీ స్కాలర్ షిప్స్ కు సంబంధించి ఇంజినీరింగ్, టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, తదితర రంగాల్లో ఈ స్కాలర్ షిప్ (scholarships) లను అందిస్తారు.

Reliance Foundation scholarships: లాస్ట్ డేట్ ఎప్పుడు?

ఈ స్కాలర్ షిప్ లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 14, 2023. ఫౌండేషన్ వెబ్ సైట్ www.scholarships.reliancefoundation.org. లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. తన మామగారైన ధీరూభాయి అంబానీకి భారతీయ యువత శక్తి సామర్ధ్యాలపై అపార విశ్వాసం ఉండేదని, వారికి సరైన సహకారం అందిస్తే వారు ఉన్నత శిఖరాలకు చేరగలరని భావించేవారని రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) చైర్ పర్సన్, ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ వెల్లడించారు.

Reliance Foundation scholarships: అర్హత ఏంటి?

వార్షిక ఆదాయం రూ. 15 లక్షల కన్నా తక్కువ ఉన్న కుటుంబాలకు చెందిన, డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు www.scholarships.reliancefoundation.org. ద్వారా అప్లై చేసుకోవచ్చు. దివ్యాంగులు, మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. అత్యంత తెలివైన 100 మంది విద్యార్థులకు పీజీ స్కాలర్ షిప్ లభిస్తుంది. సమాజాభివృద్ధి కోసం ఆలోచించే, సృజనాత్మక, దూర దృష్టి కలిగిన, పర్యావరణంపై అవగాహన ఉన్న విద్యార్థులను ఈ (Reliance Foundation) స్కాలర్ షిప్ (scholarships) కోసం ఎంపిక చేస్తారు. ఈ స్కాలర్ షిప్ కోసం ఎవరైనా www.scholarships.reliancefoundation.org. ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, సెలక్షన్ ప్రాసెస్ మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు రూ. 6 లక్షల వరకు గ్రాంట్ లభిస్తుంది. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మేథమేటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్ ఇంజినీరింగ్, లైఫ్ సైన్సెస్ లకు చెందిన విద్యార్థులను మెరిట్ బేసిస్ పై ఎంపిక చేస్తారు.

IPL_Entry_Point

టాపిక్