Regular oxygen supply priority: ‘‘మెడికల్ ఆక్సిజన్ ను సిద్ధంగా ఉంచుకోండి’’-regular oxygen supply priority govt amid preps for fresh fight against covid ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Regular Oxygen Supply Priority: Govt Amid Preps For Fresh Fight Against Covid

Regular oxygen supply priority: ‘‘మెడికల్ ఆక్సిజన్ ను సిద్ధంగా ఉంచుకోండి’’

HT Telugu Desk HT Telugu
Dec 24, 2022 08:35 PM IST

చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను ప్రారంభించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Fight against Covid: చైనాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ వల్ల ఇంత భారీగా కేసులు నమోదవుతున్నాయని భావిస్తున్నారు. భారత్ లోనూ ఈ వేరియంట్ ను గుర్తించారు. దాంతో, అప్రమత్తమైన భారత ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలను ప్రారంభించింది.

ట్రెండింగ్ వార్తలు

Fight against Covid: ఆక్సిజన్ సిద్ధంగా ఉంచుకోవాలి

కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఈ విషయంల అలసత్వం కూడదని ప్రధాని మోదీ హెచ్చరించారు. కరోనాపై పోరుకు అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉండాలన్నారు. కోరానాను ఎదుర్కోవడంలో భాగంగా చేపట్టాల్సిన చర్యలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు పంపించింది. ఆ వివరాలు ఇవీ..

  • మెడికల్ ఆక్సిజన్ ను సిద్ధంగా ఉంచుకోవాలి.
  • ఆసుపత్రుల్లో కోవిడ్ ట్రీట్ మెంట్ కు అవసరమైన ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ను సిద్ధం చేసుకోవాలి.
  • లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తో పాటు ప్రెజర్ స్వింగ్ అబ్సాప్షన్(PSA) ప్లాంట్స్ పనితీరును పరీక్షించి పెట్టుకోవాలి.
  • పీఎస్ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర ఆక్సిజన్ సంబంధిత మౌలిక వసతులను రెడీగా పెట్టుకోవాలి.
  • కేసుల సంఖ్య భారీగా పెరిగితే చేపట్టే చర్యలకు సంబంధించి మాక్ డ్రిల్స్ చేపట్టాలి.
  • అవసరమైన మానవ వనరులను, లైఫ్ సపోర్ట్ ఎక్వీప్ మెంట్ ను ప్లాన్ చేసి పెట్టుకోవాలి.

IPL_Entry_Point

టాపిక్