Tata steel stock | ఈ స్టాక్​ను ‘కొనాల్సిందే’ అంటున్న నిపుణులు!-reasons to buy tata steel stock that has fallen 28percent ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Reasons To Buy Tata Steel Stock That Has Fallen 28percent

Tata steel stock | ఈ స్టాక్​ను ‘కొనాల్సిందే’ అంటున్న నిపుణులు!

HT Telugu Desk HT Telugu
May 14, 2022 12:03 PM IST

Tata steel stock price | టాటా స్టీల్​ స్టాక్​ ధర.. 52వీక్​ హైతో పోల్చుకుంటే.. ప్రస్తుతం 28శాతం పడింది. ఇదొక మంచి అవకాశం అని టాటా స్టీల్​ స్టాక్స్​ కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. కారణాలేంటంటే..

టాటా స్టీల్​ స్టాక్​ను కొనాల్సిందే అని అంటున్న నిపుణులు
టాటా స్టీల్​ స్టాక్​ను కొనాల్సిందే అని అంటున్న నిపుణులు (iStock)

Tata steel stock price |స్టాక్​ మార్కెట్​లు ప్రస్తుతం తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. మదుపర్ల పోర్ట్​ఫోలియోలోని చాలా స్టాక్స్​.. నష్టాల్లోకి జారుకుంటున్నాయి. కాగా.. మంచి బిజినెస్​, బలమైన ఫండమెంటల్స్​ ఉన్న కంపెనీలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం అని స్టాక్​ మార్కెట్​ నిపుణులు సూచిస్తున్నారు. స్వల్పకాలంలో ఒడిగొడుకులకు లోనైనప్పటికీ.. దీర్ఘకాలంలో మంచి రిటర్నులు తెచ్చిపెడతాయని, మదపర్లు ప్రశాంతంగా ఉండొచ్చని అంటున్నారు. అలాంటి వాటిల్లో టాటా స్టీల్​ స్టాక్​ ఒకటి. పైగా 52- వీక్​ హై నుంచి ఈ టాటా స్టీల్​ స్టాక్​ ధర.. 28శాతం పడింది. ఫలితంగా.. ఈ టాటా స్టీల్​ స్టాక్​ను కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

టాటా స్టీల్​ స్టాక్​ ధర రూ. 1534 నుంచి రూ. 1094కు పడింది. అంటే అది 28శాతం. అయితే కంపెనీ లోపాలతో స్టాక్​ పడుతోందని భావించవద్దని నిపుణులు అంటున్నారు. మార్కెట్​ పరిస్థితుల కారణంగా స్టాక్​ పడుతోందని చెబుతున్నారు.

టాటా స్టీల్​ స్టాక్​లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

  • అప్పులు తగ్గుతున్నాయి:- ఏ సంస్థకైనా అప్పులు తక్కువగా ఉంటే మంచిది. వడ్డీ రేట్లు పెరుగుతున్న ఈ సమయంలో.. తక్కువ అప్పులు ఉన్న కంపెనీల ఫైనాన్షియల్స్​ బాగుంటాయి. లేకపోతే.. రెవెన్యూలో అధిక మొత్తాన్ని అప్పులకే కేటాయించాల్సి ఉంటుంది. కానీ టాటా స్టీల్​ సంస్థ.. వేగంగా అప్పులను తగ్గించుకుంటోంది. ఎఫ్​వై22లో ఈ సంస్థ తన అప్పులను 32శాతం తగ్గించుకోవడం విశేషం. గత 12 నెలలలో రూ. 15,232కోట్ల అప్పుల భారాన్ని తగ్గించుకుంది. ఫలితంగా.. రూ. 27,185కోట్ల ఫ్రీ క్యాష్​ టాటా స్టీల్​కు లభించింది. ఇటీవలే స్టీల్​ ధరలు కూడా పెరిగాయి. అందువల్ల సంస్థకు మరింత రెవెన్యూ జనరేట్​ అయ్యే అవకాశం ఉంది. దానిని అప్పులు తగ్గించుకునేందుకు సంస్థ ఉపయోగించుకోవచ్చు!
  • Tata steel dividend | డివిడెండ్​- స్టాక్​ స్ప్లిల్ట్​:- 2022 టాటా స్టీల్​.. రూ. 51/ షేరు డివిడెంట్​ను ప్రకటించింది. దీనితో పాటు స్టాక్​ స్ప్లిట్​ను కూడా ప్రకటించింది(10:1). ఎడ్జస్ట్​మెంట్​ల తర్వాత.. టాటా స్టీల్​ స్టాక్​ ధర తగ్గుతుంది.
  • ఫైనాన్షియల్స్​:- బలమైన ఫైనాన్షియల్స్​.. టాటా స్టీల్​ సొంతం. తొలిసారిగా.. క్యూ4లో ఉత్పత్తి.. 19మిలియన్​ టన్నులను దాటింది. ఏడాదితో పోల్చుకుంటే ఇది 13శాతం అధికం. నెట్​ ఫ్రాఫిట్​ రూ. 9835కోట్లుగా ఉంది. ఇక ఎబిట్​డా(EBITDA) రూ. 65,830కోట్లు. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధికం.
  • డిమాండ్​:- ఇండియా, యూరోప్​లో స్టీల్​కు మంచి డిమాండ్​ ఉండటం సంస్థకు కలిసివచ్చే విషయం. అటు చైనాలో స్టీల్​ ఉత్పత్తిని అక్కడి యంత్రాంగం కంట్రోల్​ చేస్తుండటం దేశీయంగా మంచి విషయం. ఇది టాటా స్టీల్​కు కచ్చితంగా ఉపయోగపడుతుంది. వ్యాపారానికి డిమాండ్​ ఉంటే.. లాభాలు పెరుగుతాయి.
  • వాల్యుయేషన్​:- ఫండమెంటల్​గా బలంగా ఉన్న టాటా స్టీల్​ స్టాక్​ ధర.. చీప్​ వ్యాల్యుయేషన్​లో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2021-22 ఎఫ్​వైకి టాటా స్టీల్​ ఈపీఎస్​ రూ. 271గా ఉంది. ప్రస్తుతం స్టాక్​ ధర(రూ. 1090)తో పోల్చుకుంటే ఇది 4రెట్లు డిస్కాంట్​. రానున్న రోజుల్లో కూడా టాటా స్టీల్​ సంస్థ.. ఫండమెంటల్​గా మరింత బలపడుతుందని నిపుణులు అంటున్నారు.

ప్రతికూలతలు..

Tata steel share news | ప్రస్తుతం మార్కెట్లు నెగిటివ్​ ట్రెండ్​లో ఉన్నాయి. ఆ ప్రభావం టాటా స్టీల్​ స్టాక్​పైనా పడే అవకాశం ఉంది. టాటా స్టీల్​ స్టాక్​ ధర మరింత పడొచ్చు!

ఇక అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా క్యూ4లో స్టీల్​ ధరలు భారీగా పెరిగాయి. కొద్ది కాలం తర్వాత ధరలు దిగిరావచ్చు. ఇది కంపెనీ బ్యాలెన్స్​ షీట్​పై స్వల్ప ప్రభావం(క్యూ4తో పోల్చుకుంటే) చూపించే అవకాశం ఉంది.

(గమనిక: ఇది కేవలం సమాచారం కోసం రాసిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడులు పెట్టే ముందు.. మీ ఫైనాన్షియల్​ అడ్వాజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)

IPL_Entry_Point

టాపిక్