RBI repo rate: మళ్లీ పెరగనున్న వడ్డీ రేట్లు.. ఎంత శాతం అంటే..-rbi may raise repo rate by 35 basis points in upcoming policy meet report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rbi May Raise Repo Rate By 35 Basis Points In Upcoming Policy Meet: Report

RBI repo rate: మళ్లీ పెరగనున్న వడ్డీ రేట్లు.. ఎంత శాతం అంటే..

HT Telugu Desk HT Telugu
Jul 29, 2022 01:48 PM IST

RBI repo rate: వచ్చే వారం సమావేశం కానున్న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్లను మరో 35 బేసిస్ పాయింట్ల మేర.. అంటే 0.35 శాతం పెంచనున్నట్టు ఓ నివేదిక అంచనా వేసింది.

RBI repo rate: వచ్చే వారం జరగనున్న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 0.35 శాతం పెంచే అవకాశం ఉందని ఎస్ అండ్ పి గ్లోబల్ మార్కెట్ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అంచనా వేసింది.
RBI repo rate: వచ్చే వారం జరగనున్న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 0.35 శాతం పెంచే అవకాశం ఉందని ఎస్ అండ్ పి గ్లోబల్ మార్కెట్ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అంచనా వేసింది. (HT_PRINT)

RBI repo rate: న్యూఢిల్లీ, జూలై 29: ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసే ప్రపంచ ట్రెండ్‌కు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన రాబోయే ద్రవ్య విధాన సమావేశంలో రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంచనా వేసింది.

ట్రెండింగ్ వార్తలు

తదుపరి ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఆగస్టు 3 నుంచి 5 వరకు జరగనుంది. ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను 90 బేసిస్ పాయింట్ల మేర విడతల వారీగా 4.90 శాతానికి పెంచింది.

స్వల్ప కాలిక రుణాల కోసం రిజర్వ్ బ్యాంక్ బ్యాంకుల నుంచి వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. రెపో రేటు పెరిగినప్పుడల్లా.. బ్యాంకులు అవి ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతాయి.

భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో వరుసగా ఆరో నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గరిష్ట సహన స్థాయి 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతానికి చేరుకుంది.

మరోవైపు భారతదేశ టోకు ధరల సూచీ (హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్) ఆధారిత ద్రవ్యోల్బణం ఇప్పుడు వరుసగా 15 నెలలుగా రెండంకెల స్థాయిలో ఉంది.

రష్యా-ఉక్రెయిన్ వివాదం కారణంగా గ్లోబల్ సప్లై చైన్‌లో అంతరాయం కారణంగా ముడి చమురు, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరుగుతూ వచ్చింది.

అమెరికాలో జూన్‌లో ద్రవ్యోల్బణం 9.1 శాతంగా ఉంది. ఇది 1980 నాటి గరిష్ట స్థాయికి చేరుకుంది. ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరుకోవడంతో యూఎస్ సెంట్రల్ బ్యాంక్ తన ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయాల్సి వచ్చింది.

‘ఫెడ్ 75 బేసిస్ పాయింట్ల పెంపు తర్వాత యూఎస్ మార్కెట్లు వ్యవసాయేతర పే రోల్ సంఖ్యల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇది ఫెడ్ భవిష్యత్తు మార్గానికి మార్గనిర్దేశం చేయడంలో సహాయపడుతుంది..’ అని ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ తెలిపింది.

అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఈ వారం ప్రారంభంలో అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తన కీలక పాలసీ వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ 2.25-2.50 శాతంగా నిర్దేశించింది. వడ్డీ రేట్ల పెరుగుదల సముచితమైనదని స్పష్టం చేసింది. వడ్డీ రేట్లలో పెరుగుదల కారణంగా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ చల్లబడుతుంది. తద్వారా ధరలు తగ్గుముఖం పట్టి ద్రవ్యోల్బణం రేటు నెమ్మదిస్తుంది.

WhatsApp channel

టాపిక్