RBI Grade B Notification: ఆర్బీఐ లో గ్రేడ్ బీ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్-rbi grade b 2023 notification out for 291 vacancies check exam date eligibility ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rbi Grade B 2023 Notification Out For 291 Vacancies, Check Exam Date, Eligibility

RBI Grade B Notification: ఆర్బీఐ లో గ్రేడ్ బీ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu
Apr 26, 2023 05:31 PM IST

RBI Grade B Notification: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో గ్రేడ్ బీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ https://www.rbi.org.in ద్వారా మే 9వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

RBI Grade B Notification: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో గ్రేడ్ బీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ https://www.rbi.org.in ద్వారా మే 9వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

RBI Grade B Notification: మే 9 నుంచి జూన్ 9 వరకు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో గ్రేడ్ బీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఏప్రిల్ 26వ తేదీని నోటిఫికేషన్ విడుదల అయింది. ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా మే 9వ తేదీ నుంచి జూన్ 9 వ తేదీ వరకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 291 గ్రేడ్ బీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ కార్యాలయాల్లో వీరు విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. గ్రేడ్ బీ జనరల్ (General), గ్రేడ్ బీ డీఈపీఆర్ (DEPR), గ్రేడ్ బీ డీఎస్ఐఎం (DSIM) పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల కోసం వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ను చూడాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ పూర్తైన వారికి ఆర్బీఐ అందిస్తున్న మంచి అవకాశంగా దీన్ని భావించవచ్చు. ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. అవి ఫేజ్ 1, ఫేజ్ 2, ఇంటర్వ్యూ. వీటిలో ఫేజ్ 1 పరీక్ష జులై 9, జులై 16 తేదీల్లో జరుగుతుంది. ఫేజ్ 2 పరీక్ష జులై 30, ఆగస్ట్ 19, సెప్టెంబర్ 2వ తేదీల్లో జరుగుతుంది. ఈ ఆర్బీఐ గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్ట్ బేసిక పే రూ. 52,300 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు జనరల్, ఓబీసీ కేటగిరీ వారు రూ. 850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.

WhatsApp channel