RBI Assistant Recruitment: ఆర్బీఐ లో 450 అసిస్టెంట్ పోస్ట్ లు; రేేపే లాస్ట్ డేట్
RBI Assistant Recruitment: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఆ పోస్ట్ లకు అప్లై చేయడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 4వ తేదీ తో ముగుస్తుంది.
RBI Assistant Recruitment: ఆర్బీఐ లో అసిస్టెంట్ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ రేపటితో, అంటే, అక్టోబర్ 4వ తేదీతో ముగుస్తుంది. ఆసక్తి, అర్హత ఉండి, ఇప్పటికీ అప్లై చేసుకోని అభ్యర్థులు రేపు సాయంత్రం లోగా ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ opportunities.rbi.org.in. ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు
450 పోస్ట్ లు..
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్బీఐ మొత్తం 450 అసిస్టెంట్ పోస్ట్ లను భర్తీ చేస్తోంది. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 21, అక్టోబర్ 23 తేదీల్లో జరిగే అవకాశం ఉంది. ఈ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ మెయిన్ పరీక్ష డిసెంబర్ 2 వ తేదీన జరిగే అవకాశం ఉంది. ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే, 1995 సెప్టెంబర్ 2 వ తేదీ తరువాత, 2003 సెప్టెంబర్ 1 వ తేదీ లోపు జన్మించి ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం మినహాయింపులు ఉంటాయి.
విద్యార్హతలు
ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి, ఏదైనా డిసిప్లిన్ లో కనీసం 50% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల వారు డిగ్రీ పూర్తి చేసి ఉంటే చాలు. అభ్యర్థులకు వర్డ్ ప్రాసెసింగ్ లో ప్రావీణ్యం ఉండాలి. మాజీ సైనికులు సైన్యంలో 15 సంవత్సరాలు పని చేసి ఉంటే, వారు మెట్రిక్యులేషన్ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది. అభ్యర్థులు రూ. 450 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు రూ. 50 చెల్లించాలి.
how to apply: ఇలా అప్లై చేయండి..
- ఆర్బీఐ వెబ్ సైట్ opportunities.rbi.org.in. ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీలో కనిపించే "Recruitment for the Post of Assistant - 2023" లింక్ పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్ పై అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. దాన్ని ఫిల్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
- సబ్మిట్ బటన్ నొక్కి, అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ తీసుకుని పెట్టుకోవాలి.