Crime news : పెరోల్‌పై బయటకి వచ్చిన రేపిస్ట్- కూతురు, బంధువుపై అత్యాచారం!
Rapist raped daughter : పెరోల్‌పై బయటకు వచ్చిన ఒక రేపిస్ట్, తన కూతురు- మరో బంధువుపై రేప్‌నకు పాల్పడ్డాడు! వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది ఈ ఘటన.
ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం కేసులో జైలుకు వెళ్లిన ఓ వ్యక్తి, పెరోల్‌పై బయటకి వచ్చాడు. అనంతరం తన సొంత కూతురు, మేనకోడలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు!
ఇదీ జరిగింది..
అక్టోబర్ 19న అంబికాపూర్ జైలు నుంచి పెరోల్‌పై విడుదలైన ఆ రేపిస్ట్ తన 11 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు!
తొలుత.. 2020లో తన బంధువుల చిన్నారిపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం కోర్టు వరకు వెళ్లి, అతడికి శిక్ష పడింది.
ఇటీవలే అతడు పెరోల్‌పై బయటకు వచ్చాయి. ఈ అక్టోబర్ 19 రాత్రి గదిలో తన తండ్రి తనపై అత్యాచారం చేశాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాలిక పోలీసులకు తెలిపింది.
రెండు రోజుల తర్వాత అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం మళ్లీ తన కుమార్తెను పట్టుకుని కట్టెలు సేకరించే నెపంతో గడా-బుద్ధ అడవికి తీసుకెళ్లాడు నిందితుడు. మళ్లీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. అనంతరం అక్టోబర్ 22న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలిక తన తండ్రిపై ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే అతని మేనకోడలు కూడా తన తల్లితో కలిసి బైకుంత్ పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్టోబర్ 21న తన మేనమామ తనను అడవిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేసింది.
అక్టోబర్ 21 రాత్రి నుంచి కనిపించకుండా పోయిన వ్యక్తిని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కొరియా ఎస్పీ సూరజ్ సింగ్ పరిహార్ తెలిపారు. నిందితుడి బంధువులు, ఇరుగుపొరుగువారు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలను విచారించడం ద్వారా ప్రత్యేక బృందం నిందితుడిని గుర్తించింది.
చివరికి, నిందితుడిని 150 కిలోమీటర్ల దూరంలోని కోర్బా జిల్లాలో అక్టోబర్ 26న అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు వద్ద మొబైల్ లేదని, ఒకరి మొబైల్ ఫోన్‌ను ఒకటి రెండుసార్లు వాడాడని పోలీసులు తెలిపారు. సైబర్ సెల్ నుంచి వచ్చిన సాంకేతిక సమాచారం, పరిసర ప్రాంతాల్లోని ప్రజల నుంచి అందిన సమాచారం ఆధారంగా బంఘో పోలీస్ స్టేషన్ (కోర్బా జిల్లా) పరిధిలోని బురానీ ఝరియా, ఏఎం తిక్రా ప్రాంతాలపై రైడ్ చేసి అక్టోబర్ 26 రాత్రి నిందితుడిని అరెస్టు చేసినట్లు ఓ అధికారి తెలిపారు.
ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది! రేప్ కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి, మళ్లీ అదే నేరానికి పాల్పడటం సర్వత్రా చర్చకు దారితీసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి వారికి పెరోల్ కూడా ఇవ్వకూడదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత కథనం