Ranveer Singh investment : ఈ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టిన రణ్వీర్ సింగ్!
Ranveer Singh investment : రణ్వీర్ సింగ్.. తాజాగా ఓ బ్యూటీ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. ఆ కంపెనీ ఏంటంటే..
Ranveer Singh investment : ప్రముఖ క్రికెటర్లు, నటులు.. వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్న వార్తలు ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్.. షుగర్ కాస్మొటిక్స్ అనే బ్యూటీ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ షుగర్ కాస్మొటిక్స్ సంస్థ.. ఇటీవలి కాలంలో ఇప్పటికే 50మిలియన్ డాలర్ల నిధులను సమీకరించుకోవడం విశేషం.
ట్రెండింగ్ వార్తలు
ఈ షుగర్ కాస్మొటిక్స్ సంస్థకు ఎల్ కార్టర్టన్ నేతృత్వం వహిస్తోంది. ఏ91 పార్ట్నర్స్, ఎలివేషన్ క్యాపిటల్, ఇండియా కోషియంట్లు పెట్టుబడిదారులుగా ఉన్నాయి.
రణ్వీర్ సింగ్ పెట్టుబడుల గురించి షుగర్ కాస్మొటిక్స్ సంస్థ అధికారి ప్రకటన జారీ చేసింది. తమ బ్రాండ్ అభివృద్ధికి రణ్వీర్ సింగ్ కృషి చేస్తారని స్పష్టం చేసింది. కస్టమర్ల సంఖ్యను పెంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది.
Sugar cosmetics : "రణ్వీర్ సింగ్ పెట్టుబడులతో మాకు చాలా సంతోషంగా ఉంది. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు మేము ప్రయత్నిస్తున్న సమయంలో రణ్వీర్ మాతో చేరారు. దేశంలో ఆయనొక యూత్ ఐకాన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మా బ్రాండ్‌కు సరిగ్గా నప్పుతారు. రణ్వీర్ సింగ్‌తో మా బ్రాండ్, సంస్థ అభివృద్ధి పెరుగుతుందని భావిస్తున్నాము," అని షుగర్ కాస్మొటిక్స్ కో ఫౌండర్, సీఓఓ కౌషిక్ ముఖర్జీ వెల్లడించారు.
షుగర్ కాస్మొటిక్స్‌కు దేశవ్యాప్తంగా 550 నగరాల్లో 45వేలకుపైగా రీటైల్ పాయింట్లు ఉన్నాయి. సంస్థ వార్షిక సేల్స్ రూ. 550కోట్లుకుపైనే ఉంటుంది.
లిప్ కలర్స్, ఐ మేకప్‌తో పాటు వివిధ బ్యూటీ ప్రాడక్టులను అటు ఆన్లైన్లో, ఇటు ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తుంది ఈ షుగర్ కాస్మొటిక్స్.
సంబంధిత కథనం
Investment | 6 కామన్ ఇన్వెస్ట్మెంట్ మిస్టేక్స్ ఇవే..
December 28 2021