New Governors appointment : పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్​లను నియమించిన రాష్ట్రపతి-ramesh bais appointed as maharashtra governor after president murmu accepts resignation of bhagat singh koshyari ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ramesh Bais Appointed As Maharashtra Governor After President Murmu Accepts Resignation Of Bhagat Singh Koshyari

New Governors appointment : పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్​లను నియమించిన రాష్ట్రపతి

Sharath Chitturi HT Telugu
Feb 12, 2023 10:33 AM IST

New Governors appointment : పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్​లను నియమించారు రాష్ట్రపతి. ఈ మేరకు ఆదివారం రాష్ట్రపతి భవన్​ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

మహారాష్ట్ర గవ్నరర్​గా తప్పుకున్న భగత్​ సింగ్​ కోషియారి
మహారాష్ట్ర గవ్నరర్​గా తప్పుకున్న భగత్​ సింగ్​ కోషియారి (PTI)

New Governors appointment : 12 రాష్ట్రాలకు గవర్నర్​లు, కేంద్ర పాలిత ప్రాంతమైన లద్ధాఖ్​కు లెఫ్టినెంట్​ గవర్నర్​ను నియమిస్తూ.. రాష్ట్రపతి భవన్​ ఆదివారం ఓ ప్రకటనను వెలువరించింది. మహారాష్ట్ర గవర్నర్​గా భగత్​ సింగ్​ కోశ్యారి తప్పుకున్నారు. ఆయన స్థానంలో రమేశ్​ బైస్​ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

'మహా' ఉద్రిక్తల మధ్య..

Maharashtra new governor : మహారాష్ట్ర గవర్నర్​ భగత్​ సింగ్​ కోషియారి- విపక్షాల మధ్య గత కొంత కాలంగా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈ క్రమంలో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవలే ప్రకటించారు భగత్​ సింగ్​ కోశ్యారి. తన రాజీనామాను ఆమోదించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన ద్రౌపది ముర్ము.. మహారాష్ట్ర కొత్త గవర్నర్​గా రమేశ్​ బైస్​ను నియమించారు. ఇంతకాలం ఆయన ఝార్ఖండ్​ గవర్నర్​ బాధ్యతల్లో కొనసాగారు. ఇప్పుడు ఝార్ఖండ్​ గవర్నర్​గా సీపీ రాధా కృష్ణన్​ బాధ్యతలు స్వీకరించనున్నారు.

మరోవైపు లద్ధాఖ్​ లెఫ్టినెట్​ జనరల్​ రాధా కృష్ణన్​ మూర్తి సైతం.. రాజీనామా చేశారు. ఫలితంగా ఆయన స్థానంలో బ్రిగేడియర్​ డా. బీడీ మిశ్రా (రిటైర్డ్​)ను లద్ధాఖ్​ లెఫ్టినెంట్​ జనరల్​గా నియమించింది రాష్ట్రపతి భవన్​. ఆయన ఇంతకాలం అరుణాచల్​ప్రదేశ్​కు గవర్నర్​గా వ్యవహరించారు. ఇప్పుడు ఆ స్థానాన్ని లెఫ్టినెంట్​ జనరల్​ కైవల్య త్రివిక్రమ్​ పర్నాయక్​ భర్తీ చేయనున్నారు.

AP new Governor : ఇక ఆంధ్రప్రదేశ్​ గవర్నర్​గా విశ్రాంత జస్టిస్​ ఎస్​ అబ్దుల్​ నజీర్​ నియమితులయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఈశాన్య భారతంలోనూ..

సిక్కిం గవర్నర్​గా లక్ష్మణ్​ ప్రసాద్​ ఆచార్య, హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​గా శివ్​ ప్రతాప్​ శుక్ల, అసోం గవర్నర్​గా గులామ్​ చాంద్​ కటారియాలు పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు.

President appoints new Governors : వీరితో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్​లు సైతం మారారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్​ గవర్నర్​గా ఉన్న బిశ్వ భూషణ్​ హరిచందన్​.. ఛత్తీస్​గఢ్​కు వెళ్లనున్నారు. ఛత్తీస్​గఢ్​ గవర్నర్​ శుశ్రి అనుసుయా ఉక్యె.. మణిపూర్​కు వెళ్లనున్నారు. లా గణేశన్​.. నాగాలాండ్​ గవర్నర్​గా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆయన మణిపూర్​ గవర్నర్​ పదవిలో ఉన్నారు. మేఘాలయ గవర్నర్​గా.. ఇప్పటివరకు బీహార్​లో ఆ బాధ్యతలు చూసుకున్న ఫాగు చౌహాన్​ నియమితులయ్యారు. ఇక హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​గా ఇప్పటివరకు ఉన్న రాజేంద్ర విశ్వనాథ్​ అర్లేకర్​.. బీహార్​ గవర్నర్​ బాధ్యతలు స్వీకరించనున్నారు.

రాష్ట్రపతి భవన్​ వెలువరించిన ప్రకటన ప్రకారం.. సంబంధిత గవర్నర్​లు తమ తమ రాష్ట్రాల్లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి.

IPL_Entry_Point