Ram Lalla Idol : అయోధ్య రామ మందిరానికి చేరుకున్న రామ్ లల్లా విగ్రహం
Ram Lalla Idol in Ayodhya temple : మైసూరుకు చెందిన శిల్పి రూపొందించిన రామ్ లల్లా విగ్రహం.. అయోధ్య రామ మందిరానికి చేరుకుంది. పూర్తి వివరాలు..
Ram Lalla Idol in Ayodhya temple : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు మరో కీలక పరిణామం. బుధవారం అర్థరాత్రి సమయంలో.. 'రామ్ లల్లా' విగ్రహం ఆలయానికి చేరుకుంది. భారీ క్రేన్ సాయంతో.. రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తరలించారు. జనవరి 22న జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో.. విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు.

అయోధ్య రామ మందిరంలో ఉండే రామ్ లల్లా విగ్రహాన్ని, మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. బ్లాక్ స్టోన్‌తో తయారు చేసిన ఈ విగ్రహ బరువు 150-200 కేజీల మధ్యలో ఉంటుంది. ట్రక్ సాయంతో.. రాముడి విగ్రహాన్ని అయోధ్యకు తరలించారు. కాగా.. విగ్రహం వెళుతున్న ట్రక్‌ను కొంతసేపు.. అయోధ్యలోని హనుమాన్‌గఢి ఆలయం వద్ద ఆపారు. అనంతరం.. రామ మందిరానికి తీసుకొచ్చారు.
Ayodhya Ram Mandir : కొంతసేపటికి.. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత, విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్లారు కార్మికులు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. గురువారం నాడు.. విగ్రహాన్ని గర్భగుడిలో ఇన్స్టాల్ చేస్తారని, 22న ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందని తెలుస్తోంది.
ఇదీ చూడండి:- Ayodhya Ram Mandir : రామ మందిరం- వివాదం నుంచి ఆలయ ప్రారంభోత్సవం వరకు!
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో వారం రోజుల పాటు చేపట్టాల్సిన సంప్రదాయ కార్యక్రమాలు, ఆచారాలు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం.. 11 రోజుల పాటు ఉపవాశం ఉంటున్నారు. అన్ని ఆచారాలను శ్రద్ధగా పాటించి.. చివరికి, జనవరి 22న అయోధ్యలో శ్రీ రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు.
ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో..
Ayodhya Ram Mandir latest updates : రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పలు రాష్ట్రాలు జనవరి 22న పాఠశాలలకు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాయి.
ఇక.. ప్రధాన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలోని పూజారుల బృందం ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22 న జరుగుతుంది. కాగా, ఈ మహోత్సవాన్ని పురస్కరించుకుని పలు రాష్ట్రాలు జనవరి 22వ తేదీని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం